జాన్సన్ కిడ్స్ పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి సైన్సు టాలెంట్ టెస్టులో ప్రతిభ కనబరిచారు. ఈ టెస్టులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు శనివారం పాఠశాలలో బహుమ తుల ప్రదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ వైద్యులు న్యూరాల జిస్టు పెంట్యాల అసాధారణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులు అన్ని రంగాలలో ప్రతిభ కనబరుస్తు న్నారని పేర్కొన్నారు. పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి సైన్స్ టాలెంట్ టెస్టులో ప్రతిభ కనబర్చటం ఎంతో సంతోషకరమన్నారు. అనంతరం కరస్పాండెంట్ మమతా మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాల్లో ప్రతిభ కనబరచటానికి సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులు, అధ్యాపకుల సహకారం తోనే ఇది సాధ్యమయిందన్నారు. కరాటే విభాగంలో బ్లాక్ బెల్ట్ సాధించిన సిహెచ్ గౌతమ్‌కు, టాలెంట్ టెస్టులో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు పి. కార్తిక్, జి.నవీన్, ఎస్ స్వాతి, ఎస్. దత్రీజ, వి. తేజస్‌లకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ భాగ్యలక్ష్మి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.