వికలాంగులకు సదరమ్‌ పథకం : కలక్టర్‌

  • (సాప్ట్‌వేర్‌ అసెస్‌మెంట్‌ ఆప్‌ డిజెబిలిటీ అండ్‌ యాక్సెస్‌ ఎంపవర్‌మెంట్‌)

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని చెవిటి, మూగ, అంధుల, కేటగిరి వికలాంగుల జాబితాను సిద్ధం చేసి ధృవీకరణ పత్రాల జారీ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. జిల్లాలోని మూడు డివిజన్‌ కేంద్రాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించడానికి వైద్యాధికారులను నియమించాలని, అవసరమైతే మమతా హస్పిటల్‌ నుండి వైద్య నిపుణుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. 31,197 మంది వికలాంగులకు గుర్తింపు కర్డులు జారీ చేయాల్సి ఉందన్నారు. ఖమ్మం, కొత్తగూడెం, భధ్రాచలం డివిజన్లలోని జాబితాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ ప్రక్రియ ఖమ్మం డివిజన్‌లో ప్రారంభమైందని కూసుమంచి, దమ్మపేట మండలాల్లో పూర్తి అయినట్లు కలెక్టర్‌ తెలిపారు. ఈ ప్రక్రియను మూడు దశల్లో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. మొదటిదశలో ఫెన్షన్‌ పొందుతున్న వికలాంగులు, రెండో దశలో వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, మూడో దశలో ఎలాంటి దృవీకరణ పత్రాలూ లేని వారికి గుర్తింపు కార్డులను జారీ చేయాలని ఆదేశించారు. సమావేశంలో అడిషనల్‌ జాయింట్‌ కలక్టర్‌ సుబాష్‌ చంద్రబోస్‌, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్‌ విష్ణుమోహన్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ చక్రధర్‌రావు, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్‌ వేణుమనోహర్‌, వికలాంగుల సంక్షేమశాఖ సహయసంచాలకులు మున్నయ్య, డిసిహెచ్‌ఎస్‌ డాక్టర్‌ శ్రీదేవి, ప్రభుత్వ ప్రధానాసుపత్రి సూపరిటెండెంట్‌ డాక్టర్‌ పాపాలాల్‌, మమతా హస్పింటల్‌ సూపరిటెండెంట్‌ జగదీశ్‌ పాల్గొన్నారు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్