బి-థర్మల్ విద్యుత్ కేంద్రంలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు ప్రభుత్వం విడుదల చేసిన జిఓ ప్రకారం వేతనాలు చెల్లించాలని హెచ్-43 ఏపి జెన్‌కో, ట్రాన్స్‌కో డిస్కం వర్కర్స్ యూనియన్ నాయకులు బి.దేవయ్య, ఏ.వెంకటస్వామి, జి.రమేష్, ఏ.చంద్రమౌళి, రమణారెడ్డి డిమాండ్ చేశారు. రామగుండంలోని మజీద్ కార్నర్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఏపి జెన్‌కో, ఏపి ట్రాన్స్‌కో డిస్కంలో పని చేస్తున్న వేలాది మంది కాంట్రాక్టు కార్మికులకు జిఓ ఆధారంగా వేతనాలు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి రెగ్యులర్‌గా పని చేస్తున్న కార్మికులకు ప్రతి నెలా 10 తేదీలోపు జీతాలివ్వాలని, సంవత్సరానికి ఒక జత బట్టలు, రెండు జతల బూట్లు, సబ్బులు, ఇపిఎఫ్ కటింగ్ లాంటివి ఇవ్వాలని కోరారు. సమస్యలు పరిష్కరించని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.