హాల్‌టిక్కెట్ల కోసం మండలం కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు మంగళవారం ఆందోళనకు దిగారు. కళాశాలకు చెందిన 45 మంది విద్యార్థులకు హాజరు శాతం లేదనే నేపంతో ప్రిన్సిపాల్ హాల్‌టిక్కెట్లు ఇచ్చేందుకు నిరాకరించడంతో విద్యార్థి సంఘాల జెఎసి అధ్వర్యంలో ముస్తాబాద్,కామారెడ్డి ప్రధాన రహదారిపై రాస్తారోకోకు దిగారు. సుమారు రెండు గంటల పాటు ఆందోళన జరగడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముస్తాబాద్ ఎస్‌ఐ విజయరాజ్ అధ్వర్యంలో పోలీసులు జోక్యం చేసుకోని విద్యార్థులను శాంతింపజేశారు. అనంతరం జెఎసి నాయకులు పైఅధికారులు స్పందించి హాల్ టిక్కెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.