పనులు అక్కడికక్కడా ఆగిపోయాయి. కాంట్రాక్టర్లు తమ నిర్మాణ పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ రంగంపై ఆధారపడిన కూలీల ఉపాధికి గండిపడింది. మార్చి చివరి వారం నుంచి ఇసుక రవాణాను నిలిపివేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించడంతో ఈ దుస్థితి ఏర్పడింది. ఫలితంగా పట్టణంలో భవన నిర్మాణాలు, అభివృద్ధి పనులు నిలిచాయి. కేవలం జగిత్యాల, మెట్‌పల్లి, కోరుట్ల పట్టణ పరిధిల్లోనే సుమారు రూ. కోటీకిపైగా విలువగల భవన నిర్మాణ పనులు కొన్ని మధ్యలోనే ఆగిపోయాయి. జగిత్యాల డివిజన్ పరిధిలో సుమారు 70వేల మందికి పైగా ఉన్న భవననిర్మాణ కార్మికుల బతుకులు బజారునపడ్డాయి. ఇసుక సరఫరా చేసే ట్రాక్టర్ డ్రైవర్లు, లేబర్లతోపాటు యజమానులు పదివేల మందిపైగా ఉపాధి కోల్పోయారు.
ఇసుక ర్యాంపులు
ఇబ్రహీంపట్నం మండలం కొత్తూరు, కొమటికొండాపూర్, వేమునకుర్తి, మెట్‌పల్లిమండలం ఆత్మకూర్, ఆత్మనగర్, జగ్గాసాగర్, ఆరపేట్, మల్లాపూర్ మండలం వాల్గొండ, మొగిలిపేట, దామ్‌రాజ్‌పల్లి, కోరుట్ల మండలం పెద్దవాగు, చిన్నమెట్‌పల్లి గ్రామాలు గోదావరి నదీ పరివాహక ప్రాంతాలుగా ఉన్నాయి. జగిత్యాల పరిధిలోని ధర్మపురి గోదావరి నుండి, మోతెవాగు, నిజామాబాద్ జిల్లా పాలెపు వాగు నుండి ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. జగిత్యాల డివిజన్ పరిధిలో సుమారు 5000 ట్రాక్టర్లు ఉన్నాయి. ఒక మెట్‌పల్లి పట్టణంలోనే 20 ట్రాక్టర్ అసోసియేషన్ సంఘాలున్నాయి. వీరంతా ఇసుక రవాణాపైనే
కూలీల బతుకుల్లో ఇసుక'మేటలు'
ఆధారపడి జీవిస్తున్నారు. అనుమతులు ఉన్న ర్యాంపుల నుంచి నిబంధనల ప్రకారం 2మీటర్ల లోతు మేరకే ఇసుక తోడాల్సి ఉండగా ఇష్టారాజ్యంగా నాలుగు మీటర్ల వరకు ఇసుక తీయడంతో భూగర్భ జలాలు అడుగంటే ప్రమాదమేర్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఏర్పడడంతో ఇసుక రవాణాను నియంత్రించాలని రాష్ట్ర హైకోర్టు పలుమార్లు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వం ఈ ఆదేశాలను పట్టించుకోకపోవడంతో సీరియస్‌గా పరిగణించిన హైకోర్టు ఇసుక రవాణాను పూర్తిగా నిలిపేయాలని ఆదేశాలు జారీ చేసింది.
ఉపాధికి గండి
పట్టణ వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు లక్షన్నర మంది వరకు ఉన్నారు. ఇసుక రవాణా నిలిచిపోవడంతో సుమారు లక్ష మంది కార్మికులకు పనిలేక అల్లాడుతున్నారు. కూలి పనిచేసే వీరందరూ రోజుకు రూ.250 సంపాదించేవారు. ని లభించక పూట గడవని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇసుక ట్రాక్టర్లపై ఆధారపడి జీవిస్తున్న వారిదీ ఇదే పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా సుమారు 500 ట్రాక్టర్లు ఉన్నాయి. ఒక్కో ట్రాక్టర్‌పై డ్రైవర్‌తోపాటు ఇసుకను మోసేందుకు నలుగురు కూలీలు, యజమాని ఆధారపడి జీవిస్తున్నారు. ఇసుక రవాణా నిలువడంతో ట్రాక్టర్లపై ఆధారపడి దాదాపు 3వేల కుటుంబాలు విలవిలలాడుతున్నాయి. అప్పులు చేసి ట్రాక్టర్లు కొనుగోలు చేసిన యజమానులకు ఇబ్బందులు తప్పడం లేదు. గత నెల ట్రాక్టర్లు నడవక తీసుకున్న అప్పుకు వడ్డీ కూడా చెల్లించలేని స్థితిలో ట్రాక్టర్ యజమానులు ఉన్నారు.
అక్రమ రవాణాపై కొరడా
ఇసుక తవ్వకాలపై హైకోర్టు నిషేధం విధించి నెల రోజులు దాటింది. నిషేధానికి ముందు జిల్లా వ్యాప్తంగా సుమారు 500 ట్రాక్టర్లు రోజుకు 3 ట్రిప్పుల చొప్పున 1500 ట్రాక్టర్ల ఇసుకను తరలించేవి. 20 రోజుల వరకు పోలీసులు, మైనింగ్, రెవెన్యూ అధికారుల కళ్లు గప్పి ట్రాక్టర్ యజమానులు అర్ధరాత్రి రోజుకు రెండు ట్రాక్టర్ల ఇసుకను తరలించి ఓ డంప్‌చేసుకునేవారు కానీ గత 26న హైకోర్టును ఆశ్రయించిన ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగలడంతో జిల్లాలో అధికారుల్లో చలనం వచ్చింది. ఈ క్రమంలో అర్ధరాత్రి దాడులు నిర్వహించడం ముమ్మరం చేశారు.
ఇసుకే బంగారమాయే....
ఇసుక తవ్వకాలపై నిషేధం విధించడంతో జగిత్యాల డివిజన్ పరిధిలోని ట్రాక్టర్ యజమానులు రవాణా నిలిపివేశారు. నెల రోజుల క్రితం రూ.600 నుంచి రూ.800 ఉన్న ట్రాక్టర్ ఇసుక ఇప్పుడు అమాంతంగా రూ.1600లకు పెరిగింది.
పనిలేక పదిరోజులైంది...
ఇసుక రవాణాకు బ్రేక్ పడటంతో భవన నిర్మాణ పనులు నిలిచాయి. అతి కష్టం మీద 20 రోజులు పని దొరికింది. చివరకు ఇసుక లభించక పనులు బంద్ అయ్యాయి. రోజుకు రూ.250 సంపాదించి కుటుంబాన్ని పోషించుకునే వాడిని...కానీ పది రోజుల నుంచి పని దొరకడం లేదు. తిండికి కష్టమవుతోంది.