కదంతొక్కిన కార్మికులు


  • ఉత్సాహపూరితంగా యుఇఇయు రాష్ట్ర మహాసభలు ప్రారంభం
  • నగరంలో భారీ ర్యాలీ, బహిరంగ సభ
  • వేలాదిగా తరలొచ్చిన కార్మికులు

పాలకుల విధానాలకు కడుపుకాలిన కార్మికులు కడప గడ్డపై కదం తొక్కారు. ఎర్రజెండాకు చెయ్యెత్తి జైకొట్టారు. నగర ప్రధాన వీధుల్లో జరిగిన కార్మికుల ప్రదర్శన గాలికి కదిలే ఎర్రమందారవనంలా కనిపించింది. యుఇఇయు ఏడవ మహాసభల సందర్భంగా శుక్రవారం నగరంలో భారీ ప్రదర్శన, బహిరంగ సభ జరిగింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కార్మికులు తమ తమ యూనియన్‌ బేనర్లతో సభకు హాజరయ్యారు. ఉదయం నుంచే నగరంలోని పలు వీధుల్లో ఎర్రచొక్కాలు ధరించిన కార్మికులు కనిపించారు. మధ్యాహ్నానికి నలుమూలల నుంచీ కార్మికులు వేలాది మందిగా పోగయ్యారు. ప్రదర్శనలో వాయిద్య కారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (యుఇఇయు) ఏడవ మహాసభల సందర్భంగా నగరంలో ఏర్పాటు చేసిన ర్యాలీ, బహిరంగ సభ వేలాది మంది విద్యుత్‌ కార్మికుల ఆనందోత్సాహాల మధ్య జయప్రదమయ్యాయి. నగరంలోని విద్యుత్‌ భవన వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ముఖ్యఅతిధిగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.సుధాభాస్కర్‌ హాజరయ్యారు. ఆయన మాట్లాడినంత సేపూ కార్మికులు ఉత్సాహంతో కేకలు, ఈలలు, హర్షధ్వానాలతో సభ ప్రాంగణం దద్దరిల్లింది. కార్మికుల సమస్యలపై ప్రస్తావించిన ప్రతి సారి కార్మికులు చప్పట్లతో సభా ప్రాంగణం దద్దరిల్లింది. కార్మికుల ప్రయోజనాల కోసం పోరాట సంఘంగా నిలబడిందని యుఇఇయు రాష్ట్ర అధ్యక్షులు సూరిబాబు చెప్పడంతో కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లాలో యుఇఇయు సభలను అడ్డుకునేందుకు కొందరు యూనియన్‌, ప్రజాప్రతినిధులు అడ్డుకునే ప్రయత్నాలు చేశారని ఎవరికీ బయపడమని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎన్‌.రవిశంకర్‌రెడ్డి అన్నప్పుడు కార్మికుల్లో ఉత్సాహం కనపడింది. మున్సిపల్‌ స్టేడియం నుంచి విద్యుత్‌ భవన్‌ వరకు కాలినడకన ర్యాలీలో కార్మికులు పాల్గొన్నారు. ఏడవ రాష్ట్ర మహాసభకుల సూచకంగా కార్మికులు ఏడు జెండాలను ర్యాలీ అగ్రభాగాన నిలవడం అందరినీ ఆకర్శించింది. నగరంలో కిటకిటలాడుతూ సాగిన ర్యాలీ, అనంతరం నిర్వహించిన బహిరంగ సభ సాయంత్రం 6.30 గంటలకు ముగిసింది.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్