సోమవారం ఐసిడిఎస్ కార్యాలయం వద్ద మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ధర్నా నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆమె ధర్నానుద్దేశించి మాట్లాడుతూ రాజంపేట ప్రాజెక్టులో గతేడాది పెంచిన జీతాలు ఐదు నెలలకు మాత్రమే ఇచ్చారన్నారు. ఇంతవరకు ఆరు నెలల బకాయిలు అంద లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు అంగన్‌వాడీ కార్యకర్తలకు అందించాల్సిన టిఎ, డిఎలను వెంటనే చెల్లించాలని తెలిపారు. 58 యేళ్లు నిండిన వర్కర్లకు, హెల్పర్లకు రిటైర్మెంట్ బెన్‌ఫిట్‌ను అందజేయాలన్నారు. అంగన్‌వాడీ వర్కర్లకు లక్ష, హెల్పర్లకు 50 వేలరూపాయల చొప్పున ఇవ్వాలని, పింఛన్ సౌకర్యం కల్పించాలని, పండుగ అలవెన్స్‌లు ఇవ్వాలని అన్నారు. అనంతరం సిఐటియు ఉపాధ్యక్షుడు రవికుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్‌వాడీ కార్యకర్తలకు ప్రతినెలా ఐదోతేదీలోపు వేతనాలు ఇవ్వాలని, ఇన్‌ఛార్జ్ అలవెన్స్ కింద 500 రూపాయలు ఇవ్వాలని తెలిపారు. అర్హులైన ఆయాలకు అంగన్‌వాడీ కార్యకర్తలుగా ప్రమోషన్ ఇవ్వాలని, సూపర్‌వైజర్ పరీక్షలు నిర్వహించాలని, కనీస వేతనం 10,600 రూపాయలు ఇవ్వాలని అన్నారు. అంగన్‌వాడీ సెంటర్లకు వ్యతిరేకంగా ఐకెపి సెంటర్లను ఆపాలని కోరారు. అ సెంటర్లను అంగన్‌వాడీలకే ఇవ్వాలని అన్నారు. కార్యక్రమంలో రాజంపేట ప్రాజెక్టు అధ్య క్షురాలు జయలకిë, కార్యదర్శి కృష్ణకుమారి, ఈశ్వరమ్మ, అమరావతి, ఎ.శంకరయ్య పాల్గొన్నారు.
java.lang.NullPointerException