జ్యోతిబసుకు తుది వీడ్కోలు పలికేందుకు కొల్‌కతా నగరం ఈ నెల 6వ తేదీనే సిద్ధమైంది. ఆ రోజు వేకువ ఝామునుండే నగరం దుఃఖాన్ని దిగమింగుకునేందుకు సమాయత్తమైంది. 'విషమం', వెంటిలేటర్ వంటి పదాలను నగరం అప్పుడే విన్నది. ఇక చెప్పటానికేమీలేదు. జ్యోతిబసు కొన్నేళ్ల క్రితమే ప్రజల వద్ద నుండి లాంఛనంగా వీడ్కోలు తీసుకున్నారు. జ్యోతిబసు 1930లో డిగ్రీ విద్యాభ్యాసానికి వెళ్లినపుడు మార్క్స్, ఆక్స్‌బ్రిడ్జ్ వంటి వాటికి పెద్ద వ్యత్యాసం లేదు. ఆయన ఇంగ్లండ్ నుండి పరిపూర్ణ వ్యక్తిత్వంతో మార్క్సిస్ట్ నేతగా తిరిగి వచ్చారు. ఆయన పరిపూర్ణుడైన బెంగాలీ. 20వ శతాబ్దానికి ఇద్దరు వ్యక్తులు బోసు, బసులను బెంగాలీ హీరోలుగా చెప్పవచ్చు. వారే సుభాస్ చంద్రబోస్, జ్యోతిబసు. ఒక మహామనీషి స్మృతులను గుర్తుకు తెచ్చుకునేటప్పుడు అవి కొన్ని సమిషి ్టగానూ కొన్ని వ్యక్తిగత కోణంలోనూ వుంటాయి. వ్యక్తిత్వ కోణంలోని స్మృతులు ఒక మహోన్నత వ్యక్తిత్వాన్ని మనకు చూపుతాయి. మేమిద్దరం ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో తారసపడ్డాం. 1968లో తెలిని పరాలోని మొహల్లా పట్టణంలో మత ఘర్షణలు జరిగినపుడు నేను అక్కడ చిక్కుబడిపోయాను. ఆ సమయంలో ఆయన బెంగాల్ హోం మంత్రి. ఆయన అక్కడికి వచ్చారు. ఆయన మా పట్టణానికి రాలేదు. అయితే నేను కొన్ని వారాలుగా కాలేజికి వెళ్లటంలేదన్న సమాచారాన్ని ఆయన తెలుసుకున్నారు.
ఆ మరుసటి రోజు నుండే పోలీసులు నాకు భద్రతను కల్పించారు. మా ప్రాంతంలో ఎప్పుడు మత ఘర్షణలు చోటు చేసుకున్నా సరే తెలినిపరా భద్రంగా వుంది అన్న సందేశం పంపే వరకూ ఆయన విశ్రమించే వారు కాదు. పదిమంది గుంపులో వున్నా సరే ఆయన ఎవరినీ మర్చిపోయేవారు కాదు. కొద్దిరోజుల తరువాత అకస్మాత్తుగా తనను కలుసుకోవాలని నాకు కబురు పంపారు. ఆయన ఇంటిలో సాధారణ దుస్తులు ధరించి కుర్చీలో కూర్చుని వున్నారు. వయస్సు ప్రభావంతో ఆయన ముఖంపై ముడుతలు కూడా వచ్చాయి. అయితే వీటికన్నా తన మాటలతో భిన్న వర్గాల ప్రజలను కట్టిపడేసే అత్యంత శక్తివంతుడైన ముఖ్యమంత్రి నాకు కన్పించారు. అతికష్టంమీద నేను నెమ్మదిగా మాట్లాడేందుకు ప్రయత్నించాను. ఆయనకు రెండు పుస్తకాలిచ్చాను. అయితే 'నేను చదవలేకపోతున్నానం'టూ సున్నితంగా ఆయన వాటిని నాకు తిరిగి ఇచ్చేశారు.