ప్రజాశక్తి ఉద్యోగావకాశం

  • మీలో జర్నలిజం పట్ల ఆసక్తి, సామాజిక స్పృహ ఉన్నాయా ?
  • చొచ్చుకుపోయే చొరవ ఉందా ?
  • విన్నదీ కన్నదీ పదిమందితో పంచుకుందామనుకుంటున్నారా?
  • అయితే ఆలోచనెందుకు? దరఖాస్తు పంపండి
  • మిమ్మల్ని పరిపూర్ణమైన జర్నలిస్టులుగా తీర్చిదిద్దే బాధ్యత మాకొదలండి.
  • శిక్షణ తరువాత అర్హత ప్రాతిపదికగా ప్రజాశక్తిలో జర్నలిస్టుగా ఉద్యోగం
  • వయో పరిమితి 30 సంవత్సరాలు

ఈ వరుస పైనున్న 'ప్రజాశక్తి ఉద్యోగావకాశం' పై క్లిక్‌ చేసి దరఖాస్తు పొందొచ్చు.

1. చక్కటి తెలుగు రాయగలిగి ఉండాలి.

2. ప్రజాశక్తిలోని వివిధ విభాగాలు, జిల్లా డెస్కులు, జిల్లాల్లో రిపోర్టింగ్‌, హైదరాబాద్‌లో జనరల్‌ డెస్క్‌, బ్యూరో, ఫీచర్స్‌ తదితర విభాగాల్లో పనిచేసేందుకు అవసరమైన ఆంగ్లభాషా పరిజ్ఞానం, అనువాద సామర్థ్యం, ఇప్పటికే అనుభవం గల వారికి ప్రాధాన్యత.

3. రాత పరీక్ష ఆధారంగా శిక్షణకు ఎంపిక జరుగుతుంది.

4. తెలుగు భాష, వర్తమాన రాజకీయాలు, జనరల్‌ నాలెడ్జి, అనువాదం, ఎడిటింగ్‌ అంశాలతో కూడిన ప్రవేశ పరీక్ష ఉంటుంది.

5. దరఖాస్తుదారులు కనీసం డిగ్రీ చదివినవారై ఉండాలి.

6. శిక్షణా కాలంలో ఉచిత వసతి, స్టైఫండ్‌ ఇవ్వబడుతుంది.

7. దరఖాస్తుతోపాటు సొంత చిరునామా ఉన్న 5 రూపాయల స్టాంప్‌గల కవరును విధిగా జతపర్చాలి.

8. దరఖాస్తు నమూనా, పరీక్షకు సంబంధించిన వివరాలు దిగువ సైట్‌లో చూడొచ్చు. విడి రెజ్యూం కూడా పంపొచ్చు.

9. పరీక్షకు తయారవ్వాల్సిన అంశాలు వెబ్‌సైట్‌లో పొందొచ్చు. మీకొచ్చే హాల్‌టిక్కెట్‌లోనూ ఉంటాయి.

10. అప్లికేషన్‌ చేరగానే హాల్‌టిక్కెట్లు పోస్టు చేస్తాం. వాటిలో పరీక్ష వివరాలు తెలుసుకోవచ్చు.

దరఖాస్తులు చేరాల్సిన ఆఖరు తేదీ : ఫిబ్రవరి 28, 2013

ప్రిన్సిపాల్‌, ప్రజాశక్తి జర్నలిజం కళాశాల

ఇం.నెం :1-1-298/4, రోడ్‌ నెం : 1, అశోక్‌నగర్‌

హైదరాబాద్‌ - 500 020, ఫోన్‌ : 040 27663761