1. తెలుగు ప్రశ్న పత్రం : తప్పు వాక్యాలు సరిచేయడం, సుదీర్ఘ వాక్యాలను చిన్నవిగా రాయడం, అచ్చు తప్పులను సరిచేయడం, అక్షరదోషాల నివారణ, ఇచ్చిన అంశంపై వాడుక భాషలో రాయడం, నిర్దేశించిన సన్నివేశాన్ని వర్ణించడం వంటి వాటిపై ప్రశ్నలుంటాయి.
2. ఎడిటింగ్ ప్రశ్న పత్రం : పత్రికల్లో వచ్చే వార్తలు, పాత్రికేయ వృత్తి సంబంధ విషయాలు, క్లుప్తీకరణ, ఇచ్చిన విషయాన్ని వార్తగా రాయడం వంటి అంశాలపై ప్రశ్నలుంటాయి.
3. కరెంట్ ఎఫైర్స్ : గడిచిన మూడు నెలల్లో వార్తలకెక్కిన సామాజిక, ఆర్థిక, రాజకీయ, సినిమా, క్రీడాంశాలపై పరీక్ష ఉంటుంది. 'ప్రజాశక్తి' చదివి వివరాలు సేకరించుకుంటే తేలికవుతుంది.
4. అనువాదం : ఒక వార్తను ఇంగ్లీషులో ఇస్తాం. దానిని సరళమైన తెలుగులో రాయాలి. ఇంగ్లీషు పత్రికల్లో వార్తలను అనువదించే సాధన చేస్తే మంచిది. అనువాదకులకు ప్రాధాన్యత ఉంటుంది.
పరీక్షకు సూచనలు :
1. మీ పేరు విడిగా ఇచ్చే దరఖాస్తులోనే ఉండాలి. ఆన్సర్ షీట్‌లోని ఏ పేజీలోనూ రాయకూడదు. ప్రతి షీట్‌లోనూ హాల్‌టిక్కెట్ నెంబర్ తప్పనిసరిగా వేయాలి. పేజీలపై నెంబర్లు కూడా ఉండాలి.
2. ప్రశ్నపత్రాలు నాలుగు ఉంటాయి. ఒక ప్రశ్నపత్రంలోని సమాధానాలు ముగిశాక మరో ప్రశ్నపత్రం ప్రారంభించాలి. అడిషనల్ ఆన్సర్ షీట్స్‌పై పేజీ నెంబరుతోపాటు హాల్‌టిక్కెట్టు నెంబరు కూడా వేయాలి. క్రమం తప్పకుండా అడిషనల్ షీట్స్‌ను మెయిన్ ప్రశ్న పత్రానికి పిన్ చేయాలి.
3. మీకిచ్చిన ఆన్సర్ షీట్లు చాలకుంటే పరీక్ష నిర్వాహకులనడిగి పొందవచ్చు.
4. ఈ హాల్ టిక్కెట్లను పరీక్షా కేంద్రానికి తప్పనిసరిగా తీసుకురావాలి.
గమనిక : దరఖాస్తు www.prajasakti.com సైట్ నుంచి పొందొచ్చు.
మా చిరునామా:
ప్రిన్సిపాల్, ప్రజాశక్తి జర్నలిజం కళాశాల
ఇం.నెం : 1-1-298/4, రోడ్ నెం :1, అశోక్ నగర్
హైదరాబాద్ - 500 020, ఫోన్ : 040 27663761