మహిళా శక్తికి వందనం

- మనదేశంలో 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం ఆడవారి సంఖ్య 58.6 కోట్లు.

- వృత్తి, ఉద్యోగాలు చేస్తున్న మహిళల సంఖ్య 11.2 కోట్ల మంది.

-వ్యవసాయ రంగంలోనే మనదేశంలో అధిక శాతం స్త్రీలు ఉన్నారు. 68.5 శాతం మంది , అంటే 7.7 కోట్ల మంది సేద్యంలో కృషి చేస్తున్నారు.

- వస్తూత్పత్తి రంగంలో, అదీ పొగాకు ఉత్పత్తులు, దుస్తుల తయారీ రంగంలో శ్రామిక మహిళలు దాదాపు10.8 శాతం మంది ఉన్నారు.

- భవన నిర్మాణ రంగం మహిళలు పెద్ద సంఖ్యలో పనిచేస్తున్న రంగాల్లో మూడోది. ఈ రంగంలో 57 లక్షల మంది మహిళలు పనిచేస్తున్నారు. అంటే, దాదాపు 5.1 శాతం మంది అన్న మాట.

- విద్యారంగంలో 3.8 శాతం మంది మహిళలు పనిచేస్తున్నారని అంచనా. వీరిలో ఎక్కువ శాతం మంది, అంటే దాదాపు 25 లక్షల మంది ప్రాథమిక విద్యారంగంలోనే పనిచేస్తున్నారు.

- ఆహార సరుకుల దుకాణాల్లో వివిధ పనుల్లో మహిళలు 2.1 శాతం మంది పనిచేస్తున్నారు.

- ఇంటిపనివారు1.6 శాతం మంది ఉన్నారని అంచనా.

- వ్యక్తిగత సేవలు అందించే మహిళలు మన దేశంలో సుమారు 1.5 శాతం మంది ఉన్నారు. అంటే అందాల సంరక్షణ, వస్త్రాలు అమ్మడం, పెళ్లిళ్లు కుదర్చడం, చిన్న పిల్లల ఆలనా పాలనా లాంటి వాటిల్లో వీరు పనిచేస్తున్నారు.

- ఆరోగ్య సంరక్షణ రంగంలో 1.1 శాతం మంది, అంటే 12.5 లక్షల మంది స్త్రీలున్నారు.

- ఉన్నత ఉద్యోగులుగా ఒక్క శాతం మంది మహిళలు మాత్రమే పనిచేస్తున్నారు.