నాలో దర్శకురాలంటేనే ఇష్టం

కథకురాలిగా, సినీ జర్నలిస్టుగా కెరీర్‌ను కొనసాగిస్తున్న బి.జయ తనలోని దర్శకురాలి కోణాన్ని చంటిగాడు, గుండమ్మగారి మనవడు, సవాల్‌ చిత్రాల ద్వారా వెలికి తీశారు. దానికి పూర్వమే 'ప్రేమలో పావనీ కళ్యాణ్‌' చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా వ్యవహరించారు. ఆ చిత్రానికి దర్శకునిగా పనిచేసిన వ్యక్తి కొన్ని కారణాలవల్ల చేయలేకపోతే మొదటగా ఆమెలోని దర్శకురాలిని గుర్తించి ప్రోత్సహించింది ఆమె భర్త బి.ఎ.రాజు. ఆయన ఇచ్చిన స్పూర్తితోనే 'చంటిగాడు' చిత్రాన్ని మొదట అనుకున్న దర్శకుడు పరిమిత బడ్జెట్‌లో తీయలేనంటే.. ఆ బాధ్యతను ఆమె నిర్వర్తించి 80లక్షలతో పూర్తిచేశారు. ఇలా ఒక్కో చిత్రానికి దర్శకత్వం వహిస్తూ పూర్తిస్థాయి సక్సెస్‌కోసం తపిస్తున్న ఆమెకు 'లవ్‌లీ' చిత్రం ఆమె కోరికను తీర్చింది. చక్కటి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ సందర్భంగా విలేకరులకు సోమవారంనాడు ఆమె పలు విషయాలను తెలియజేశారు.

ప్రేక్షకుల స్పందన ఎలా ఉంది?

థియేటర్‌లో కూర్చొన్న ప్రేక్షకులు ఇంటర్వెల్‌లో తప్ప బయటకుపోవడం అనేది చూడలేదు. ఏ ఉద్దేశ్యంతో సినిమా తీశామో అది చేరగలిగాం. విడుదలైన మూడురోజుల్లో ఆది తొలి చిత్రం 'ప్రేమకావాలి' కంటే ఎక్కువ వసూలు చేసింది. ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారనేందుకు ఇదే నిదర్శనం.

ఎవరినుంచి ఉత్తమ ప్రశంస అందుకున్నారు?

నా సినిమా చూశాక.. ఒకమ్మాయి థియేటర్‌నుంచే వారి నాన్నకు ఫోన్‌చేసి ఏడుస్తూ మాట్లాడింది.. ఎందుకేడుస్తున్నావ్‌. అని అడిగితే.. లవ్‌లీ సినిమా చూశాను నాన్న. అందులో తండ్రీ కూతుళ్ళ సెంటిమెంట్‌ బాగుంది. నిన్ను చూడాలనుందని చెప్పింది.. మేం రాసుకున్న ఆ కథను తండ్రిగా రాజేంద్రప్రసాద్‌ అద్భుతంగా మెప్పించారు. విడుదలచేసిన బయ్యర్లు కూడా ఈ సినిమా బాగా ఆడుతోందని చెప్పడం నిజంగా మంచి కాంప్లిమెంట్‌.

చిన్నయి పాత్ర హైదరాబాద్‌ స్లాంగ్‌పెట్టడానికి కారణం?

హైదరాబాద్‌లో నివసించే సీమాంద్రవాసుల పిల్లలు ఇక్కడే పుట్టి పెరగడం వల్ల హైదరాబాద్‌ వ్యావహారిక భాష మాట్లాడుతుంటారు. ఆమె విదేశాల్లో ఉండడంతో ఎక్కువగా ఇంగ్లీషు మాట్లాడుతుంటేది. తెలుగు మాట్లాడితే వెరైటీగా ఉండేది. అందుకే సహజంగా ఉండాలనే ఉద్దేశ్యంతో అలాపెట్టాం. ఆమె ప్రియుడు వెన్నెల కిషోర్‌ పాత్ర అదే శ్లాంగ్‌లో ఉండడంతో ఇద్దరికీ మంచి రెస్పాన్స్‌ వచ్చింది. చాలారోజుల తర్వాత నాకు మంచి పాత్ర ఇచ్చారని ఇద్దరూ అంటుంటే చాలా హ్యాపీగా ఫీలయ్యాను.

ఆహుతిప్రసాద్‌ ఎలా స్పందించారు?

లవ్‌లీలో బంకు బాబూరావు పాత్ర పోషించారు. ఆ పాత్రకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. గతంలో 'చంటిగాడు' చిత్రంలో ఆయన నటించిన క్యారెక్టర్‌ మూడు రకాల శ్లాంగ్‌లు మాట్లాడతాడు. ఆ చిత్రాన్ని చూసి కృష్ణవంశీగారు మెచ్చుకున్నారు. 'చందమామ'లో అదే శైలి ఉపయోగించారు. ఆ తర్వాత ఈ తరహాలో ఆయనకు అవకాశాలు రావడం జరిగింది. ఈ విషయాన్ని ఆయన చాలాసార్లు చెప్పారు.

ఏ అంశాలు ప్రేక్షకులు మెచ్చారని భావిస్తున్నారు?

వేసవిలో సినిమా రిలీజ్‌ చేస్తున్నామంటే.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజుల్లో సినిమాకు రావడం చాలా కష్టమైంది. అందుకే కథలో తగు జాగ్రత్తలు తీసుకున్నాం. యూత్‌తోపాటు ఫ్యామిలీని మెప్పించే అంశాలు ఇందులో ఉన్నాయి. మొదటి భాగమంతా యూత్‌కు నచ్చేది. రెండవ భాగం ఫ్యామిలీ సెంటిమెంట్‌. ఈ రెండు నచ్చాయికాబట్టే మంచి స్పందన వచ్చింది.

రాజేంద్రప్రసాద్‌ పాత్రకు ఇన్‌స్పిరేషన్‌ ఎవరు?

మా నాన్నగారే. ఆడపిల్లలున్న ఇంటికి వచ్చేవాడు ఎలాంటి వాడు వస్తాడనే టెన్షన్‌ తండ్రిగా ఆయనకు ఉండేది. మా కుటుంబాల్లో కొంతమంది కూతురు మూమెంట్స్‌ కోసం డిటెక్టివ్స్‌ను నియమించేవారు. లవ్‌లీలో రాజేంద్రప్రసాద్‌ పాత్రకు అదే ప్రేరణ.

గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాను ఏవిధంగా నిర్వచిస్తారు?

నా గత చిత్రాలైన 'చంటిగాడు' గుండమ్మగారి మనవడును విశ్వనాథ్‌, కె. రాఘవేంద్రరావు శైలిలో తీశారనే అన్నారు. ఈ చిత్రానికి అటువంటి పోలిక లేకుండా జయ మార్క్‌తో తీసిన చిత్రమని చాలా మంది తెలియజేశారు. ఈ చిత్రాన్ని ఒక ఏరియాను రచ్చ నిర్మాత కొనగా, తూర్పుగోదావరిలో బెల్లంకొండ సురేష్‌ కొన్నారు. మంచి చిత్రం తీశావని మెచ్చుకున్నారు. సురేష్‌గారు వారి బేనర్‌లో ఆఫర్‌ కూడా ఇచ్చారు.

మీకు స్పూర్తినిచ్చిన దర్శకులెవరు?

ముందుగా భానుమతి రామకృష్ణ. ఆ తర్వాత విజయనిర్మల. భానుమతిగారు ఆల్‌రౌండర్‌. నటిగా, గాయనిగా, సంగీతదర్శకురాలిగా, నిర్మాతగా, దర్శకురాలిగా అన్నింటిల్లో ప్రావీణ్యం పొందారు. అప్పట్లోనే 'చండీరాణి' చిత్రంలో నటిస్తూ మూడు భాషల్లో రూపొందించడం మామూలు విషయం కాదు. అలాగే విజయనిర్మలగారు కవిత, మీనా, హేమాహేమీలు అనే విభిన్న కథాంశాలతో కూడిన చిత్రాలకు దర్శకత్వం వహించారు. మలయాళంలోకూడా చేశారు. కృష్ణగారికి జేమ్స్‌బాండ్‌ చిత్రాల ఇమేజ్‌ ఉన్న టైమ్‌లోనే వెంటనే 'మీనా' తీసి మెప్పించారు. ఆమెతో నన్ను Publiture