రొమాన్స్‌లేని రొమాంటిక్‌ మూవీ...

అనగనగా ఓ రాజు...అనే తరహా కథలకు పెట్టింది పేరు ఎస్‌.ఎస్‌.రాజమౌళి. ఈసారి 'మర్యాద రామన్న' కథ చెప్పబోతున్నాడు. హీరోలకు ఎంత బిల్డప్‌ ఉంటుందో ఈయన చిత్రాల్లోని కత్తి, డాలు, గొడ్డలి వంటి వస్తువులకూ అంతే బిల్డప్‌ ఉంటుంది. టాప్‌ యాంగిల్‌లో వీటికి ఎంట్రీ ఇవ్వడం ఇతని శైలి. ఇపుడు సైకిల్‌ వంతు. దీన్ని నడిపిస్తూ సునీల్‌తో రొమాంటిక్‌ హాస్యాన్ని పండించబోతున్నాడు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. చిత్రం గురించి దర్శకుడు మర్యాద రాజన్న (రాజమౌళి) చెబుతున్న సంగతులు...

మర్యాద రామన్న హాస్యాన్ని పంచుతాడా ?

అవును. ఇదో హాస్య చిత్రం. చాలా సహజ సిద్ధంగా కథనం ఉంటుంది. సన్నివేశపరంగా, సందర్భయుతంగా కామెడీ పండుతుంది. కామెడీ అన్నాం కదా అని కార్టూన్‌ చిత్రంలో లాగా పాత్రలన్నీ కామికల్‌గా ఉండవు. మరో విధంగా చెప్పాలంటే ఇదో రొమాంటిక్‌ లవ్‌స్టోరీ. కానీ హీరోహీరోయిన్స్‌ మధ్య రొమాన్స్‌ మాత్రం ఉండదు. ఆ ఫీల్‌ మాత్రం కలుగుతుంది.

కత్తి, డాలు, గొడ్డళ్లు వంటి వాటితో బాగానే యుద్ధాలు చేసారు. ఇపడు కామెడీ కింగ్‌మేకర్‌ అనిపించుకోవాలనా ?

ఓ సినిమా చేయాలనుకున్నపుడు...సబ్జెక్టు నన్ను ఇబ్బంది పెట్టకూడదు. మర్యాద రామన్న కథ నాకు బాగా నచ్చి చేస్తుంది. నేల విడిచి సాము చేయడం నా తరహా కాదు.

'మగధీర' భారీ విజయం తర్వాత సునీల్‌తో చేయడానికి కారణం ?

'మగధీర' షూటింగ్‌ సమయంలోనే ఈ ప్రాజెక్ట్‌ చేయాలనుకున్నా. ఎందుకంటే 'మగధీర' చాల పెద్ద ప్రాజెక్ట్‌. భారీ బడ్జెట్‌. ఎక్కువ సమయం తీసుకునే అంశం. అలాగే చాలామంది శారీరకంగా, మానసికంగా శ్రమపడ్డాం. అలిసిపోయాం. వెంటనే మరో పెద్ద ప్రాజెక్ట్‌ చేయలేం. కొంత రీఛార్జ్‌ కావాలి. 'మర్యాదరామన్న' ఆ వెసులుబాటు ఇచ్చింది.

సునీల్‌ను ఏ విధంగా చూపుతారు ?

చాలా అమాయకుడు. ఇంతక్రితం చేసిన, చూపిన హావభావాలు రాకూడదని సునీల్‌కు చెప్పా.

విడుదలకు ముందే కథ చెప్పారు. కారణం ?

చిత్రాన్ని ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లే క్రమంలో ఇదొ ఎత్తుగడ. ఈ తరహా చిత్రాల కథ బయట పెట్టకుండా ఉండలేం. ముఖ్య విషయం ఏంటంటే...కథ ఇక్కడ ఇంపార్టెంట్‌ కాదు. కథనం ఎలా ఉన్నదనేదే ముఖ్యం. 'మగధీర' తరహాలో ఈ చిత్రం ఉంటుందనే ఊహలతో వచ్చే ప్రేక్షకులుంటారని ఊహించాం. దీన్ని సరిదిద్దాలనుకున్నాం.

గత చిత్రాలకు మీ తండ్రి కథనందించారు. ఈసారి కంచి కథ తీసుకున్నారు ?

అవును. కంచి కొత్తవాడేం కాదు. 'ఛత్రపతి' నుంచి కంచి నా స్టోరీ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నాడు. కథా చర్చల్లో నాది మోనార్క్‌ తరహా. నా డామినేషన్‌కు తగ్గ స్థాయిలో స్టోరీని సిద్ధం చేసే వ్యక్తి కంచి. 'మర్యాదరామన్న' కోసం మంచి కథ ఇచ్చాడు.

సోషల్‌ నెట్‌వర్క్‌ ట్విట్టర్‌లో ప్రవేశించారు. ఎలా ఉంది అనుభవం ?

సినీ అభిమానులతో నేరుగా కనెక్ట్‌ అవడం బాగుంది. కొన్ని సందేశాలు బాగున్నాయి. మరికొన్ని చేదుగా ఉన్నాయి. వారు ఏం అనుకుంటున్నారు అనేది నేరుగా చేరుతోంది. అదేసమయంలో నేనూ వారికి నేరుగా సమాధానం ఇచ్చే అవకాశం ఉంది.

ఓ పెద్ద హీరో తీసుకునే పారితోషికంతో 'మర్యాదరామన్న' తీసారంట ?

పెద్ద చిత్రానికి ఉపయోగించే సామాగ్రీనే ఇక్కడా వాడాం. సేమ్‌ యూనిట్‌, టెక్నీషియన్స్‌, సేమ్‌ స్టాండర్డ్స్‌.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్