మైనారిటీల సంక్షేమానికి రాష్ట్ర బడ్జెట్‌లో అరకొర నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి కె.రోశయ్య అందులోనూ క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్‌తో మెలిక పెట్టి తన చాణక్యనీతి ప్రదర్శించారు. మైనారిటీ సంక్షేమానికి సంబంధించిన నిధుల్లో తమకు న్యాయమైన వాటా దక్కడం లేదని క్రిస్టియన్ల విజ్ఞప్తి మేరకు 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి క్రైస్తవులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. అయితే నిధుల కేటాయింపు మాత్రం మైనారిటీల ఆర్థిక సంస్థ నిధుల్లో కోత పెట్టి క్రిస్టియన్ కార్పొరేషన్‌కు కేటాయించారు. రాష్ట్ర బడ్జెట్‌లో మైనారిటీల సంక్షేమానికి రూ.237 కోట్లు కేటాయించారు. 2001 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభాలో ముస్లిం మైనారిటీలు 9.17 శాతం ఉన్నారు. క్రైస్తవులు 1.55 శాతం ఉన్నారు. మొత్తం మైనారిటీ జనాభాలో క్రైస్తవుల జనాభా15 శాతం ఉందని ప్రభుత్వం వారికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఈ కార్పొరేషన్‌కు నేరుగా నిధులు కేటాయించకుండా మైనారిటీ ఆర్థిక సంస్థకు కేటాయించిన నిధుల నుండి కేటాయించడం గమనార్హం. అయితే జనాభా దామాషా ప్రకారం లక్ష కోట్ల రాష్ట్ర బడ్జెట్‌లో మైనారిటీలకు 10,000 కోట్ల కేటాయించాల్సి ఉంది. కానీ ప్రభుత్వం కేటాయించింది రూ. 237 కోట్లు మాత్రమే. మైనారిటీ జనాభాలో క్రైస్తవులు 15 శాతం ఉన్నారని ప్రభుత్వం మైనారిటీ కార్పొరేషన్ నిధుల్లో నుండి 15 శాతం నిధులను క్రిస్టియన్ కార్పొరేషన్‌కు కేటాయించింది. జనాభా దామాషా ప్రకారం మైనారిటీలకు నిధులు కేటాయించనప్పుడు క్రైస్తవులకు ఎలా కేటాయిస్తారని, దీంతో ముస్లిం, ఇతర మైనారిటీలకు అన్యాయం జరుగుతుందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రూ.237 కోట్ల మైనారిటీ బడ్జెట్‌లో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు రూ.176.05 కోట్లు కేటాయించగా క్రైస్తవ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు రూ.26.48 కోట్లు కేటాయించారు.
వాటర్ బోర్డులో కలకలం
అంతర్యుద్ధం - ఆధిపత్య పోరు
ఆర్థిక ఇబ్బందులతో .. కుటుఉంబ ఆత్మహత్య
వాటర్‌బోర్డులో కంట్రోల్ రూం ఏర్పాటు
ఆరోగ్యశ్రీలో చికిత్స పొందిన వారికి ఉచిత మందులు
సినారే జన్మదిన వేడుకలు భలే మంచిరోజు- పసందైనరోజు
హుస్సేన్‌సాగర్ వద్ద 92.7ఎఫ్ఎమ్ ఆధ్వర్యంలో మారథాన్ 92.7
విద్యార్థుల పురోభివృద్ధిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించండి : కలెక్టర్
జంక్షన్లలో 275 ట్రాఫిక్ గొడుగులు