లెక్చరర్ లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా కెరీర్ ప్రారంభించడానికి అర్హత కల్పించే స్టేట్ లెవల్ ఎల్జిబిలిటీ టెస్టు(స్లెట్) నిర్వహణకు ఓయు అధికారులు స్వరసిద్ధం చేశారు. రాష్ట్రంలో దాదాపు 13ఏళ్ల తర్వాత ఈ పరీక్షను నిర్వహించేందుకు యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి) అనుమతినిచ్చింది. స్లెట్ నిర్వహణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం ఓయుకు అప్పగించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే ఓయులోని ఆచార్య జి రాంరెడ్డి దూర విద్యా కేంద్రంలో రెండోఫ్లోర్ వద్ద గత నెలలో ఓయు విసి స్లెట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అయితే జూన్ నెలలో స్లెట్‌ను నిర్వహించాలని భావించిన అధికారులు, లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడంతో దీన్ని జూలై 27కు వాయిదా వేశారు. మూడు దశల్లో ఈ పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు ఓయు స్లెట్ సభ్య కార్యదర్శి ఆచార్య రాజేశ్వర్‌రెడ్డి ముమ్మర ఏర్పాట్లలో నిమగమయ్యారు.
1తెలుగు విద్యార్థుల సౌకర్యం కోసం..
ఇదివరకు కాకుండా ప్రస్తుతం నిర్వహించబోయే స్లెట్ పరీక్ష తెలుగులో రాసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు స్లెట్ ఛైర్మన్ ఓయు ఉపకులపతి ఆచార్య శిరసాని సత్యనారాయణ తెలిపారు. దీనివల్ల ఈ పరీక్షకు విద్యార్థులు భారీ స్థాయిలో దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు.
నిపుణుల పర్యవేక్షణలోనే..
యుజిసి నెట్ తరహాలోనే రాష్ట్రస్థాయిలో కూడా స్లెట్ నిర్వహణ కోసం ఒక కమిటీ ఉంది. ప్రధానంగా స్లెట్ పరీక్ష నిర్వహణ, ఇతర పాలనా వ్యవహారాల కమిటీలో ఓయు విసి, ప్రభుత్వ నామినీ, ఇద్దరు ఇతర యూనివర్శిటీల విసీలు, యుజిసి నామినేట్ చేసే ఇద్దరు ప్రొఫెసర్లు, ఇతర రాష్ట్రాలకు చెందిన మరికొందరు నామినీలు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీనే స్లెట్ నిర్వహణ తేదీలు, పరీక్షల ప్యాట్రన్, వాల్యుయేషన్, ప్రశ్నాపత్రాల రూపకల్పన అన్ని అంశాలను పర్యవేక్షిస్తుంది. ఒక్కోసబ్జెక్టులో 10మంది నిపుణులతో కూడిన బృందం ప్రశ్నాపత్రాన్ని తయారు చేయనుంది. దీంట్లో యూజిసి ప్రతినిధులు సైతం క్రియాశీలక పాత్ర వహించనున్నారు. యుజిసి నెట్ తరహాలోనే ఈ పరీక్షకు ప్రశ్నాపత్రాలన్నీ ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. మూడు పేపర్లలో ఉండే ఈ పరీక్షకు ఒక్కోపేపరుకు వందమార్కులుంటాయి. ఇప్పటికే స్లెట్‌కు దరఖాస్తులు లక్షా 33వేల 500 మంది అభ్యర్థులు, 25 సబ్జెక్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు.
వీటిలో హార్డు కాపీలు 1.10 లక్షలు అందాయని, మరో 22 వేల దరఖాస్తులకు హార్డ్ కాపీలు అందాల్సి ఉందని, వీటిని పంపేందుకు ఈ నెల 18వరకు గల గడువు ముగిసిందని రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఆన్‌లైన్‌లో సబ్జెక్టుల వారీగా అందిన దరఖాస్తులు.. లైఫ్ సైన్స్‌కు 21,636, కెమికల్ సైన్స్‌కు 18,894, తెలుగు 11,726 రాగా, లింగ్విస్టిక్స్‌లో అత్యల్పంగా 1 దరఖాస్తు వచ్చినట్లు తెలిపారు. పరీక్షకు పదిరోజుల ముందుగా వెబ్‌సైట్లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంటాయి.
30 విభాగాలు - 3900ల ఖాళీలు
చాలా ఏళ్ల తర్వాత నిర్వహిస్తున్న స్లెట్ పరిధిలోకి మొత్తం 30 సబ్జెక్టులను తీసుకున్నట్లు ఓయు అధికారులు తెలిపారు. వీటిలో ఆర్ట్స్, సైన్స్ సబ్జెక్టులతో పాటు ప్రధానంగా బయోకెమిస్ట్రీ, బోటనీ, జూవాలజీ, మైక్రో బయాలజీ, మ్యాథ్స్, హిస్టరీ, పాలిటిక్స్, జర్నలిజం, సోషియాలజీ, తెలుగు, సైకాలజీ, ఇంగ్లీష్ వంటి పలు సబ్జెక్టులకు ఈ పరీక్షను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, ఎయిడెడ్ కాలేజీలు, యూనివర్శిటీల్లో వివిధ సబ్జెక్టుల్లో కలిపి ప్రస్తుతం 3900 పోస్టులు ఖాళీగా ఉన్నాయని గుర్తించినట్లు తెలిపారు. ఈ పోస్టులకనుగుణంగా స్లెట్ ఉత్తీర్ణతను కమిటీ నిర్ణయిస్తుంది. పిజిలో కనీసం 55శాతం మార్కులు వచ్చి ఉంటే పరీక్షకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు సరిపోతాయి. ఈ పరీక్ష సిలబస్‌ను ఓయు వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచినట్లు, అలాగే స్లెట్ కోసం నూతనంగా వెబ్‌సైట్‌ను ప్రారంభించినట్లు వారు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష కేంద్రాలు
స్లెట్ పరీక్ష నిర్వహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాల్లో పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో 20, వరంగల్‌లో 15, నిజామాబాద్‌లో10, నల్గొండలో 15, కర్నూల్‌లో 10, కడపలో 10, అనంతపురం10, తిరుపతి 15, నెల్లూరు10, రాజమండ్రి10, గుంటూరు12, విశాఖపట్నం15 సెంటర్లలో ఎలాంటి విమర్శలకూ తావులేకుండా పరీక్షను అత్యంతకట్టు దిట్టంగా నిర్వహించనున్నారు.
మొత్తం మూడు పేపర్