మల్కాజిగిరి సర్కిల్ 139వ డివిజన్ బిజెఆర్‌నగర్‌లో 11-160/69/1 నెంబరు గల ఇంటిముందు పదిహేను రోజులుగా మురుగునీరు ప్రవహిస్తోందని, దీని వల్ల కాలనీవాసులు అసౌకర్యానికి గురవుతున్నారని మల్కాజిగిరి సిపిఎం కార్యదర్శి ఎన్.శ్రీనివాస్ తెలిపారు. ఈ సమస్యను సర్కిల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఈ మురుగు పరుగు వల్ల వాహనదారులు, పాదచారులు ఇబ్బందులకు గురవుతున్నారని తెలియజేశారు. కానీ అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించకపోతే సర్కిల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.
java.lang.NullPointerException