దుక్కి , ఎడతెగని ప్రయాణం గ్రంథాలకు ఫ్రీ వర్స్‌ ఫ్రంట్‌ పురస్కారాలు

నాలుగు దశాబ్దాలుగా ప్రతి ఏటా ఉత్తమ వచన కవిత్వ గ్రంథాన్ని ఎంపిక చేస్తున్న ఫ్రీ వర్స్‌ ఫ్రంట్‌ 2008 సంవత్సరానికి గాను చింతా అప్పలనాయిడు రాసిన 'దుక్కి' గ్రంథానికి, 2009 సంవత్సరానికి యాకూబ్‌ రాసిన 'ఎడతెగని ప్రయాణం' గ్రంథానికి బహుమతులను ప్రకటించింది. ఈ బహుమతి కింద ఒక్కొక్కరికి పదివేలు నగదుతో పాటు సంస్థ చిహ్నమైన మెమోంటోను అందజేస్తారు. త్వరలో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే బహుమతి ప్రదాన కార్యక్రమంలో వీటిని అందజేస్తారని శీలా వీర్రాజు పేర్కొన్నారు. వర్థమాన సమస్యల నేపథ్యంలో రైతన్న ఎదుర్కొంటున్న దుర్భర జీవితాన్ని కళ్లకు కట్టిన ట్టు 'దుక్కి'లో రచయిత చూపారు. అదేవిధంగా ఆత్మీయానుబంధాలు, స్నేహసౌజన్యాలు మనిషి జీవితం నుంచి కనుమరుగై పోతున్న ఆధునిక సమాజంలో వాటి కోసం తపించే వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుందో 'ఎడతెగని ప్రయాణం'లో కవి చక్కగా వర్ణించారు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్