ప్రేక్షకుల 'ప్రియేష్‌' భానా

    న్యూఢిల్లీ: ఇక్కడ జరుగుతున్న 12వ ప్రపంచకప్‌ హాకీ టోర్నమెంట్‌లో ప్రేక్షకుల మనన్నను అధికంగా చూరగొంటున్న ఆటగాళ్లలో న్యూజిలాండ్‌ జట్టులో ఆడుతున్న ప్రియేష్‌ భానా ఒకడు. భారత సంతతికి చెందిన భానా న్యూజిలాండ్‌లో నివాసం ఉంటున్నాడు. చిరుతపులి మాదిరిగా బంతిమీద లంఘించే భానా న్యూజి లాండ్‌ లోనే కాదు, కెనడాలోని హాకీ ఆడతాడు. అంతేకాదు ఇందుగలడందు లేడని సందేహం వలదన్నట్లు మలేసియా, కెన్యా దేశాల్లో కూడా హాకీ ఆడతాడు. న్యూజిలాండ్‌లో నివాసం ఉంటున్న భారతీయులు హాకీ పట్ల విపరీతమైన మక్కువ చూపుతారు. అందులో ఒకరికి కివీస్‌ జాతీయ జట్టులో స్థానం లభించడం విశేషం. ధ్యాన్‌చంద్‌ స్టేడియంలో హాకీ ఆడుతున్న వివిధ దేశాలకు చెందిన క్రీడాకారుల్లో ప్రియేష్‌ భానా బిగ్గెస్ట్‌ హిట్‌ అనడంలో సందేహం లేదు. భానా ముత్తాతలు న్యూజిలాండ్‌లో స్థిరపడ్డారు. తాము అక్కడ ఉంటు న్నప్పటికీ భారత్‌తో తమ సంబం ధాలు విడదీ యరాని విధంగా పెనవేసుకు పోయాయని భానా పేర్కొన్నాడు. సైమన్‌ ఛిల్డ్‌ భద్రతాపరమైన ఆందోళనతో ఉపసంహరించుకోగా న్యూజిలాండ్‌ జట్టులో చివరి నిమిషాల్లో స్థానం సంపాదిం చుకోగలిగాడు. భారత్‌ రావడం తన అదృష్టమని భానా వ్యాఖ్యానించాడు. ఈ సంద ర్భంగా గుజరాత్‌ రాష్ట్రంలోని తమ పూర్వీకుల ఇంటిని సందర్శిం చాలని అతని కుటుం బం భావి స్తోంది. ప్రపంచ కప్‌లో ఆడాలన్న తన కోరిక నెరవేరి నందుకు సంతోషంగా ఉందని, ఈ సందర్భంగా పుట్టినింటికి రావడం గర్వంగా ఉందని పేర్కొ న్నాడు.

    తమ కుటుంబం కూడా ఇక్కడకు వచ్చేం దుకు ఎంతో ఉబలాటపడిందని తెలిపాడు. హాకీ క్రీడ తమకు ఈ అవకాశం ఇచ్చిందని అన్నాడు. తన తండ్రి న్యూజిలాండ్‌లో జన్మించారని, తల్లి జాంబియాకు చెందిందని తెలిపాడు. గుజరాత్‌లోని మచ్చాడ్‌లో తమ పూర్వీకుల ఇల్లు ఉందని తెలిపాడు. న్యూజి లాండ్‌ జట్టులో అరుణ్‌ పాంచియా అనే మరో భారతీయ సంతతికి చెందిన క్రీడాకారుడు కూడా ఉన్నాడు. న్యూజిలాండ్‌ తరఫున భారత దేశంలో అరంగేట్రం చేసే అవకాశం అతడికి లభించింది. భారత్‌ సందర్శిండం తనకు ఇది రెండోసారని, 2008లో పంజాబ్‌ గోల్డ్‌కప్‌లో ఆడేందుకు ఛండీ ఘర్‌ వచ్చానని వెల్లడించాడు. తాను తరంకిలోని హవేరాలో జన్మిం చానని, భారత దేశ సంస్కృతి అంటే తనకు అపరి మితమైన ఇష్టమన్నాడు. పాకిస్తాన్‌ వైదొలగడంతో గోల్డ్‌కప్‌లో ఆడేందుకు న్యూజిలాండ్‌ను ఆహ్వానించారు. ఆ విధంగా భారత్‌ సందర్శించే అవకాశం తనకు దక్కిం దని తెలియజేశాడు. నాలుగేళ్ల వయసులో భానా హాకీ ఆడటం ప్రారం భించాడు. భారతీయ సంతతికి చెందిన ఉమేష్‌ పరాగ్‌, మితేష్‌ పటేల్‌ తనకు మెళకువలు నేర్పా రన్నాడు. తన సోదరుడు ధర్మేష్‌ తనకు ప్రేరణ అన్నాడు. న్యూజిలాండ్‌లో హాకీ ఆడే భారతీయులు అనేకమంది ఉన్నారని తెలిపాడు. తాను వారికి కోచింగ్‌ ఇస్తుంటానన్నాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ జట్టు సెమీఫైనల్స్‌కు చేరుకోగలదని ఆశిస్తున్నట్లు తెలిపాడు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్