అవినీతిని సమర్థంగా ఎదుర్కోండి

  • శాసన సభ్యులకు మన్మోహన్‌ పిలుపు
  • తమిళనాడు అసెంబ్లీ నూతన భవనం ప్రారంభం

అవినీతి అసమర్థతలను శాసనసభ్యులు సమర్థంగా ఎదుర్కోవాలని ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ పిలుపు నిచ్చారు. శాసన సభ్యులంతా ప్రజాధన సంరక్షకులేనని, ప్రజా ప్రతినిధులుగా శాసన సభ్యుల పాత్ర కీలకమని మన్మోహన్‌ అన్నారు. తమిళనాడు సచివాలయ(అసెంబ్లీ) నూతన భవన సముదాయాన్ని మన్మోహన్‌ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భం గా ఆయన శాసన సభ్యుల నుద్దేశించి మాట్లా డారు. అవినీతి, అసమర్ధతల నిర్మూలనకు ధృఢ చిత్తంతో కృషి చేయాలని వారికి ఆయన పిలుపు నిచ్చారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూ స్తూ సేవలందించాలని మన్మోహన్‌ తెలిపారు. అసెంబ్లీ నూతన భవన సముదాయాన్ని తిలకిస్తుంటే శాస నాత్మక పోటీలో ఉన్నతశిఖరాలను చూసినట్లుగా ఉంద ని ప్రధాని అన్నారు. ప్రజల వాస్తవిక సమస్యలకు దర్ప ణం పట్టి వాటికి పరిష్కారం చూపే దిశలో జరిగే చర్చ లకు ఈ భవనం వేదిక కావాలని మన్మోహన్‌ ఆకాంక్షించారు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్