ఆర్టీసి డ్రైవర్‌ ఉద్యోగాలకు 'ఎత్తు' అర్హతలో కాస్త సడలింపు

ఆర్టీసి డ్రైవర్‌ పోస్టులకు ప్రస్తుతం ఉన్న అర్హతలను స్పల్పంగా మార్పులు చేశారు. సోమవారం జరిగిన పాలకమండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసి అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఆర్టీసి డ్రైవరు పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థుల ఎత్తు 165 సెంటీమీటర్లు ఉండాలి. అయితే తాజా నిర్ణయం ప్రకారం అభ్యర్థుల ఎత్తు అర్హతను 165 నుంచి 160 సెంటీమీటర్లకు తగ్గించారు. హెవీ వెహికల్‌ శిక్షణా కాలాన్ని కూడా ఐదు సంవత్సరాల నుంచి మూడున్నర సంవత్సరాలకు తగ్గించారు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్