ముస్లింలకు ప్రభుత్వం కేటాయించిన నాలుగు శాతం రిజర్వేషన్లు చెల్లవంటూ రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో మిగతా వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్లపై చర్చ జరుగుతోంది. అయితే అన్ని వర్గాలకు సంబంధించి రాజకీయ, విద్యాపరమైన రిజర్వేషన్లలో కొంత వైవిధ్యం కనిపిస్తోంది. విద్యాపరంగా బిసిలకు- 29 శాతం (బిసి-ఇతో కలిపి), ఎస్సీలకు-15 శాతం, ఎస్టీలకు-06 శాతం, వికలాంగులకు- మూడు శాతం, మాజీ సైనికోద్యోగులు, ఎన్‌సిసి, స్పోర్ట్స్‌ల వారికి ఒక్కొక్క శాతం చొప్పున రిజర్వేషన్లు కేటాయించారు. బిసీలో గ్రూపు-ఎ వారికి ఏడు శాతం, గ్రూపు-బి వారికి పది, గ్రూపు-సివారికి ఒకటి, గ్రూపు- డి వారికి ఏడు, గ్రూపు-ఇ వారికి నాలుగు శాతం చొప్పున రిజర్వేషన్లు కేటాయించారు. ఇదే సమయంలో రాజకీయ రిజర్వేషన్లను చూస్తే బిసిలకు 27 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు ఆరు శాతం కేటాయించారు.