వివాదాస్పద పోలవరం ప్రాజెక్టు పనులను శుక్రవారం తెల్లవారుజామున ప్రారంభించాలని ట్రాన్స్‌ట్రారు నిర్ణయించింది. ఈ మేరకు నీటిపారుదలశాఖ అధికారులకు సమాచారాన్ని అందించింది. ఉదయం 6.57 గంటలకు భూమిపూజ చేసి పనులు ప్రారంభించాలని ఆ సంస్థ సిద్ధమైంది. అయితే, ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులూ దూరంగా ఉంటారని సమాచారం. సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం ఉదయం ఢిల్లీకి వెడుతున్నారని, అందువల్ల ఈ కార్యక్రమానికి అందుబాటులో ఉండరని సిఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి. పోలవరం టెండర్ల విష యం వివాదాస్పదం కావడంతో మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సిద్ధ పడటం లేదని సమాచారం. దీంతో ప్రాజెక్టు నిర్మాణంతో లబ్ధి పొందనున్న రైతులతోనే భూమి పూజ నిర్వహించాలని ట్రాన్స్‌ట్రారు నిర్ణ యిం చింది. ఈ మేరకు ఆ సంస్థ ఏర్పాట్లు చేస్తోంది.
java.lang.NullPointerException