మధ్యాహ్న భోజనం ఖర్చు పెంపు

  • 5వ తరగతి లోపు పిల్లలకు రూ.4,
  • ఆపై విద్యార్థులకు రూ.4.65

మధ్యాహ్న భోజన పథకం వంట ఛార్జీల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం 7.5 శాతం పెంచింది. ప్రాథమిక పాఠశాలల్లో చదివే ( 1-5వ తరగతి) ప్రతి విద్యార్థికి అయ్యే ఖర్చును రూ.3.84 పైసల నుంచి రూ.4కు, ఆపై చదివే విద్యార్థులకు రూ.4.40 పైసల నుంచి రూ.4.65 పైసలు పెంచింది. 2012-13 విద్యా సంవత్సరంలో ఏప్రిల్‌ 1 నుంచే అమల్లోకి వస్తుందని తెలిపింది. ఈ మేరకు మాధ్యమిక విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్‌ తివారీ జీవో నెంబర్‌ 321ను సోమవారం విడుదల చేశారు. తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకూ ఈ పెంపుదల వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. వంట ఛార్జీలను పెంచాలని మధ్యాహ్న భోజన కార్మికులు, తల్లి దండ్రులూ చాలా కాలంగా కోరుతున్నారు.

Sorry

java.lang.NullPointerException