అంబులెన్స్‌నూ పెట్టరా !

  • కిరణ్‌ సర్కారు తీరుపై రోశయ్య ఆగ్రహం

తన పర్యటనలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ తమిళనాడు గవర్నర్‌ కె. రోశయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్‌గా అమలు చేయాల్సిన ప్రోటోకాల్‌ను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు తమిళనాడు గవర్నర్‌ కార్యాలయం నుండి రాష్ట్ర ప్రభుత్వానికి సోమవారం లేఖ అందింది. తన కాన్వారులో నిబంధనల ప్రకారం ఒక అంబులెన్స్‌ను ఏర్పాటు చేయాల్సి ఉందని, వైద్యుడిని కూడా అందుబాటులో ఉంచాల్సి ఉందని ఈ లేఖలో రోశయ్య ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు. ఇటీవల తాను రాష్ట్రంలో జరిపిన పర్యటనల్లో ఈ నిబంధనలను ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ లేఖపై రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి స్పందనా వ్యక్తం చేయలేదు.