బాబ్లీపై 2న సిఎంల సమావేశం

వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టు విషయంలో కేంద్రం ఎట్టకేలకు స్పందించింది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రుల ముఖాముఖి సమావేశానికి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ తేదీ ఖరారు చేశారు. ఆగస్టు రెండవ తేదీ సాయంత్రం 7, రేస్‌కోర్స్‌రోడ్డులోని ప్రధానమంత్రి అధికారిక నివాసంలో ఈ సమావేశం నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి గురువారం సమాచారం అందింది. ఆ రోజు సాయంత్రం ఏడు గంటలకు ఏర్పాటు చేసిన రెండు రాష్ట్రాల సిఎంల సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాలని ముఖ్యమంత్రి కె రోశయ్యను ప్రధానమంత్రి కార్యాలయం కోరింది. ఈ మేరకు పిఎం ఆఫీసు నుంచి ఫోన్‌ వచ్చింది. గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మి స్తున్న బాబ్లీ ప్రాజెక్టు విషయమై రాష్ట్రంలో కొంత కాలంగా ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ బృందం బాబ్లీ సందర్శనకు విఫలయత్నం చేసిన తరువాత ముఖ్యమంత్రి కె రోశయ్య నేతృత్వంలో ప్రధానమంత్రిని కలిసింది. బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణంతో రాష్ట్రానికి ఎదురయ్యే ఇబ్బందులను వివరించిన అఖిలపక్ష ప్రతినిధులు ప్రధానమంత్రిని ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరారు. ఆ సందర్భంగానే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. ఆ మేరకు ఆగస్టు రెండవ తేదీన సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు వర్తమానం అందడంతో ముఖ్యమంత్రి అనంతర చర్యలపై దృష్టి సారించారు.

1న అఖిలపక్ష సమావేశం : సిఎం

ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి తేదీ ఖరారు కావడంతో అఖిలపక్ష ప్రతినిధులు సమావేశాన్ని మరోసారి నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు ఒకటవ తేదీన ఈ సమావేశం నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి కె రోశయ్య తెలిపారు. గురువారం సాయంత్రం సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రి వద్దకు అఖిలపక్ష ప్రతినిధుల బృందం గతంలో వెళ్లినప్పుడూ ముందుగానే చర్చించుకొని ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేశామని, అదే తరహాలో మరోసారి సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఆహ్వానాన్ని అఖిలపక్ష నేతలకు చెప్పి, రాష్ట్ర వాదనలు మరింత గట్టిగా విన్పించడానికి వారి సలహాలను కోరాలని నిర్ణయించినట్లు తెలిపారు.ఇప్పటిదాకా కోర్టుల్లో చేసిన వాదనలను మరింత సమర్ధవంతంగా ప్రధాని సమక్షంలో చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రుల సమావేశంతో సమస్య పరిష్కారమ వుతుందని భావిస్తున్నారా అన్న ప్రశ్నకు 'నేను ఆశావాదిని' అని సిఎం జవాబిచ్చారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ముఖ్యమంత్రుల సమావేశం వల్ల ప్రయో జనం లేదంటూ చేసిన వ్యాఖ్యను ప్రస్తావించగా ప్రస్తుతం ప్రధానమంత్రి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు తుది అనుమతులు ఇవ్వడంతో పాటు, బాబ్లీపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి ప్రధానమంత్రి చొరవ చూపానని, దీనికి ఆయనకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు సిఎం తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు పొన్నాల లకëయ్య, గాదె వెంకటరెడ్డి పాల్గొన్నారు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్