రాజీవ్ స్వగృహ పథకాన్ని ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కె. రోశయ్య గరువారం గృహ నిర్మాణ పథకంపై సమీక్ష నిర్వహించారు. అనంతరం గృహనిర్మాణ శాఖమంత్రి శిల్పా మోహనరెడ్డి విలేకరులతో మాట్లాడారు.జాయింట్ వెంచర్ ప్రాతిపదికన పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంతో రాజీవ్ స్వగృహ నిర్మాణాలను చేపట్టాలన్న తమ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని ఆయన చెప్పారు. ఒకటి, రెండు నగరాల్లో తొలుత ప్రయోగాత్మకంగా దీనిని అమలు చేస్తామని, తరువాత రాష్ట్రమంతా విస్తరిస్తామని చెప్పారు. రాజీవ్ స్వగృహ నిర్మాణాల కోసం టెండర్లు పిలిచినప్పటికీ స్పందన రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మార్కెట్ ధరలకన్నా 25శాతం తక్కువగా ఉండేలా ఈ గృహనిర్మాణాలను పూర్తి చేయాలని, నాణ్యతలో ఏమాత్రం రాజీ లేకుండా చూడాలని సిఎం ఆదేశించినట్లు చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకంలో అవినీతి చోటు చేసుకున్న విషయం వాస్తవమేనని అన్నారు. అవినీతి కారణంగా ఎంత మొత్తంలో నష్టం జరిగిం దన్న విషయాన్ని సాధ్యమైనంత త్వరలో ప్రకటిస్తామని ఆయన చెప్పారు. 'పెద్దఎత్తున అవినీతి జరిగినట్లు ఆరో పణలు వస్తున్నాయి. శాఖాపరమైన విచారణ జరుపు తు న్నాం.
కొన్ని చోట్ల అవినీతి జరిగినట్లు తేలుతోంది. వాటిని ఒప్పుకుంటున్నాం. అవినీతికి పాల్పడిన వారిపై క్రిమి నల్ కేసులు నమోదు చేస్తున్నాం. ఆర్‌్‌అర్ చట్టం కింద చర్య లు తీసుకుంటున్నాం. ఇంకా పూర్తి స్థాయిలో విచారణ నిర్వహి స్తాం. మొత్తం అవినీతిని వెలికితీస్తాం. బాధ్యులనుఅధికారులనూ, ప్రజాప్రతినిధులను, ఇతర సిబ్బందిని గుర్తిస్తాం. ఎంత మొత్తంలో అవినీతి జరిగిందో సాధ్యమైనంత త్వరలో ప్రకటిస్తాం' అని ఆయన అన్నారు. అవినీతిని తగ్గించడానికి ఇప్పటికే ప్రయత్నాలు చేపట్టినట్లు తెలిపారు. ఈ ఏడాది ఇందిరమ్మ పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 6.92 లక్షల ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఏప్రిల్ ఒకటి నుండి ఇప్పటి వరకు 168878 ఇళ్లను నిర్మించినట్లు తెలిపారు. మిగిలిన ఇళ్లను కూడా ఈ ఏడాది చివరికి పూర్తి చేయగలమన్న ధీమాను వ్యక్తం చేశారు. ఇందిరా ఆవాస్ యోజన పథకాన్ని ఈ ఏడాది ఎస్‌సి, ఎస్టీ, మైనార్టీలకు మాత్రమే పరిమితం చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ పథకంలో లబ్ధిదారులకు 45వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని, అదనంగా ఎస్సీ, ఎస్టీ లబ్దిదారులకు 9,250 రూపాయలను రుణంగా అందచేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇందిరమ్మ పథకంలో నమోదు కాకుండానే చేపట్టిన ఇళ్లకు సైతం పూర్తి స్థాయిలో బిల్లులు చెల్లించాలన్న ప్రతిపాదనకు ముఖ్యమంత్రి అంగీకరించినట్లు తెలిపారు. 2009 ఎన్నికలకు ముందు వివిధ రాజకీయపార్టీల నాయకులు ఇచ్చిన హామీలతో ఈ మేరకు పెద్దఎత్తన ఇళ్ల నిర్మాణాలు చేపట్టారని, బిల్లులు మంజూరుకాకపోవడంతో వివిధ దశల్లోనూ అవి ఆగిపోయాయని తెలిపారు.