చలనచిత్ర పరిశ్రమపై సేవల పన్ను విధించే ప్రతిపాదనను విరమించుకోవాలని కోరుతూ సినిమా, వినోద రంగానికి చెందిన ప్రముఖుల బృందం ఒకటి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడానికి సిద్ధమవుతోంది. యాష్ చోప్రా, బోనీ కపూర్, రోనీ స్క్రూవాలా, మహేష్ భట్ తదితరులు ఈ బృందంలో ఉన్నారు. మార్చి 22న న్యూ ఢిల్లీలోని ఎక్సైజు అధికారులను కలవాలని ఈ బృందం యోచిస్తోంది. రూ.9,600 కోట్ల విలువగల భారతీయ చలనచిత్ర పరిశ్రమ ఇప్పటికే పెరిగి పోతున్న వ్యయంతో సతమతమవుతున్నందున మినహాయింపు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఈ బృందం వాదన.