బుకింగ్ ప్రారంభించిన రెండు రోజుల్లోనే వంద కార్లకు ఆర్డర్‌లు వచ్చాయని, అంత డిమాండ్ ఉన్న వోక్స్ వాగన్ పోలో నగర మార్కెట్‌లోకి గురు వారం నుంచి విడుదల చేస్తున్నట్లుగా ఒరియన్ మోటార్స్ తెలిపింది. ఈ సందర్భంగా ఆటోమోటి ీవ్ మాన్యూ ఫ్యాక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జి క్యూటీవ్ డైరెక్టర్ రాజీవ్ సంఘ్వి మాట్లాడుతూ వోక్స్‌వాగన్ జంట నగరాలలో ఏకైక డీలర్‌గా ఉన్న తమ సంస్థ అనుబంధ కంపెనీ ఒరియన్ మోటార్స్ ద్వారా ఇప్పటికే బుకింగైన వంద కార్లతో పాటు మరో వంద అయినా అమ్మటానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కంపెనీ సరఫరాలను దృష్టిలో పెట్టుకొని బుకింగ్ లను అనుమతి స్తున్నట్లుగా వివరించారు. కొత్త పోలో కార్లు 1.2 లీటర్ల పెట్రోలు, డీజిల్ వర్షన్‌లలో దొరుకు తాయని, పెట్రోల్ వర్షన్ ధర రూ.4.50 లక్షలు, డీజిల్ వర్షన్ ధర రూ.5.52 లక్షలు ఎక్స్ షోరూమ్ దరగా పేర్కొన్నారు. ఇందులో ఐదు స్పీడ్ గేర్ బాక్సులతో మూడు ట్రిమ్‌లెవెల్ (హైలైన్, కంఫర్ట్‌లైన్, ట్రెండీలైన్)తో కలిగి ఉండటం వీటి ప్రత్యేకతలుగా వివరించారు. అలానే కాండీవైట్, ఫ్లాష్ రెడ్, రిఫ్లక్స్ సిల్వర్, గ్లేసియర్ బ్లూ, పెప్పర్ గ్రే, డీప్ బ్లాక్ అనే ఆరు రంగులలో అందుబాటులో ఉన్నట్లుగా తెలియజేశారు.