వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా స్టీల్ ధరలు భారీగా పెరగనున్నాయని సంబంధిత పరిశ్రమ వర్గాలు తెలిపాయి. పెరుగుతున్న ముడిసరుకుల ధరలు, డిమాండ్, దృష్ట్యా రానున్న కాలంలో స్టీల్ ధరలను పెంచక తప్పడం లేదని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. 2010-11లో స్టీల్ ఉత్పత్తిలో ముఖ్యమైన ముడిసరుకుల ధరలు 25-30 శాతం పెరగనున్నాయని టాటా స్టీల్ చీఫ్ అబితాబ్ పండా తెలిపారు. దీంతో స్టీల్ ఉత్పత్తిదారులపై అత్యధిక స్థాయిలో భారం పడనుందని పేర్కొన్నారు. అదేవిధంగా దేశీయంగా స్టీల్ వినియోగం 8-9 శాతం వృద్ధి చెందనుందని వివరించారు. వార్షికంగా స్టీల్ ఉత్పత్తి సామర్థ్యం పెంపు లక్ష్యాన్ని మరింతగా పెంచాలనే ఉద్దేశ్యంతో ప్రణాళికల ను రూపొంది స్తున్నట్లుగా సెయిల్ పేర్కొంది. అందులో భాగంగానే 2014 నాటికి 26 మిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధించేందుకు అవసరమైన చర్యలను పకడ్బందీగా రూపొందిస్తున్నట్లుగా ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు.