రంగంలోని భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసి) త్వరలో ఒక బ్యాంకును నెలకొల్పే అవకాశాలు కనపడుతున్నాయి. బ్యాంకు నెలకొల్పడానికి అవసరమైన లైసెన్సు కోసం భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ)ని ఎల్‌ఐసి సంప్రదించనుంది. మరిన్ని బ్యాంకులకు ఆర్‌బిఐ ద్వారా అనుమతులివ్వనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్న విషయం విదితమే. ఈ పరిణామాలతో సంబంధం కలిగిన వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం దేశంలోని అతిపెద్ద బీమా సంస్థ ఒక బ్యాంకును నిర్వహించాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలిపారు. భారీ సంఖ్యలో ఉన్న ప్రీమియంలను వసూలు చేయడానికి, క్లెయిములకు సంబంధించిన సెటిల్‌మెంట్ పనులను చేయడానికి ఒక బ్యాంకును నిర్వహించాలనే అంశంపై ఎల్‌ఐసి దీర్ఘ కాలంగా యోచిస్తోంది. ఉదాహరణకు ఈ సంవత్సరం జీవిత బీమా సంస్థ దాదాపు రూ.1,76,000 కోట్లకు పైగా ప్రీమియం ఆదాయం వసూలు కాగలదని అంచనా వేస్తోంది. అదే విధంగా ప్రతి సంవత్సరం దాదాపు ఒక కోటి ఏభై లక్షల క్లెయిములను పరిష్కరించవలసి వస్తోంది. ఇందులో పాలసీదారులకు చేసే చెల్లింపులు కూడా ఉంటాయి. వార్షిక వ్యాపారానికి సంబంధించి తరచూ చెల్లింపులు జరుపవలసిన అవసరం కూడా ఉంటుంది. బీమా నియంత్రణదారు నుండి ప్రత్యేక ఆమోదంపై పలు భారతీయ బ్యాంకుల్లో ఎల్‌ఐసికి వాటాలు ఉన్నాయి. ప్రభుత్వ యాజమాన్యం లోని కార్పొరేషన్ బ్యాంకులో ఎల్‌ఐసికి 26 శాతం వాటా ఉంది.బ్యాంకింగ్ రంగంలోకి జీవిత బీమా సంస్థ రావాలంటే ముందుగా తన మూలధనాన్ని అదనంగా పెంచుకోవలసి ఉంటుంది. ప్రస్తుత చట్టం ప్రకారం ఎల్‌ఐసికి చెల్లించిన మూలధనం రూ.5 కోట్లుగా ఉంది.