జిడిపి వృద్ధి 7.2 శాతం మాత్రమే!

  • ప్రభుత్వ స్పష్టీకరణ

వ్యవసాయ రంగం ఉత్పత్తి తగ్గుతున్న కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం (2009-10)లో స్థూల జాతీయ ఉత్పత్తి (జిడిపి) వృద్ధి గతేడాదిలో ఉన్న 6.7 శాతం కన్నా కొద్దిగా పెరిగి 7.2 శాతంగా మాత్రమే ఉంటుందని సోమవారం ప్రభుత్వం అంచనా వేసింది. కేంద్ర స్టాటిస్టికల్‌ ఆర్గనైజేషన్‌ ముందస్తు అంచనా ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం జిడిపి వృద్ధి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, రిజర్వు బ్యాంకు అంచనాల కన్నా తక్కువగా ఉన్న విషయం గమనార్హం. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్వహించిన మధ్యంతర ఆర్థిక సమీక్ష సందర్భంగా జిడిపి వృద్ధి 7.75 శాతం ఉంటుందని ప్రకటించగా, గతనెలలో రిజర్వు బ్యాంకు నిర్వహించిన క్యూ-3 ద్రవ్య సమీక్షలో జిడిపి వృద్ధి 7.5 శాతంగా ఉంటుందని అంచనా వేసిన సంగతి తెలిసిందే. మొత్తానికి అందరి అంచనాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో ఉన్న ఏడు శాతం కన్నా రెండో అర్ధ సంవత్సరంలో అధికంగా జిడిపి వృద్ది ఉంటుంద నేది ప్రధానమైన అంశంగా విశ్లేషకులు వివరిస్తు న్నారు. ఇదే సందర్భంగా వ్యవసాయ రంగం మాత్రం గతేడాది 1.6 శాతం వృద్ధిని సాధించగా ఈ ఆర్ధిక సంవత్సరంలో మాత్రం తగ్గటం అనివార్యంగా అందరూ భావిస్తు ్తన్నారు. స్టాటిస్టికల్‌ ఆర్గనైజేషన్‌ కూడా వ్యవసాయ రంగం వృద్ధి మైనస్‌ 0.2 శాతంగా పడిపోయే ప్రమాదాన్ని అంచనా వేస్తుంది.

అలానే ఉత్పత్తి రంగం వృద్ధి గతేడాది 3.2 శాతం ఉంటే ఇప్పుడు 8.9 శాతానికి, మైనింగ్‌ 1.6 శాతం నుంచి 8.7 శాతానికి, విద్యుత్‌, గ్యాస్‌, వాటర్‌ సప్లయి రంగాలు 3.9 శాతం నుంచి 8.2 శాతం దాకా పెరుగుతాయని ముందస్తు అంచనాలను తెలియ జేసింది. అలానే హోటల్‌, ట్రేడ్‌, రవాణా, కమ్యూనికేషన్‌ రంగాల వృద్ధి 7.6 శాతం నుంచి 8.3 శాతానికి, నిర్మాణ రంగం వృద్ధి 5.9 శాతం నుంచి 6.5 శాతానికి పుంజుకుంటాయని అంచనాలలో వివరించగా, ఫైనాన్సు, ఇన్సూరెన్సు, రియల్‌ ఎస్టేట్‌, బిజినెస్‌ సర్వీసులు మాత్రం 10.1 శాతం నుంచి స్వల్పంగా తగ్గి 9.9 శాతంగా నమోద వ్వొచ్చని తెలిపింది. కమ్యూనిటీ సోషల్‌, పర్సనల్‌ సర్వీసు రంగాలు కూడా 13.9 శాతం నుంచి 8.2 శాతానికి తగ్గుతాయని అంచనాను ప్రకటించింది. అన్నింటికన్నా ముఖ్యంగా ఉత్పత్తి రంగం వృద్ధనేది ముఖ్యమైందిగా ఉన్నా భారీ స్థాయిలో వృద్ధిని కనబర్చ టానికి ప్రధాన కారణం మాత్రం ప్రభుత్వం ఈ రంగానికి అందించిన ఉద్దీపనలే అనేది మర్చిపోకూ డదు. అదేవిధం గా వ్యవసాయ రంగం వృద్ధి పదాన గనక ఉంటే జిడిపి వృద్ధి రెండంకెల స్థాయిని తాకినా ఆశ్చర్యపోవక్కర లేదనేది కూడా విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. ముఖ్యంగా ముందస్తు జిడిపి అంచనాలను తయారు చేయటానికి, ప్రకటించటానికి ముఖ్యమైన కారణం వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ తయారు చేయటానికి అనేది మర్చిపోకూడని అంశం. ఈ అంచనాల ప్రకారమే బడ్జెట్‌ తయారీ ఉంటుందనేది వారి వాదన.

ఉద్దీపనల ఉపసంహరించే సమయం ఆసన్నమైంది

ఈ ఆర్థిక సంవత్సరంలో జిడిపి వృద్ధి 7.2 శాతంగా ఉంటుందనే అంచనాలను పూర్తిగా సంతృప్తి చేందామని అందువల్ల వచ్చే బడ్జెట్‌లో దశల వారిగా ఉద్దీపనలను ఉసంహ రించే సమయం ఆసన్న మైందని ప్రణాళికా సంఘం డిప్యూటీ ఛైర్మన్‌ డాక్టర్‌ మాంటెక్‌ సింగ్‌ వెల్లడించారు. ఉద్దీపనలు విజయవం తం అయ్యాయని, వీటిని దశల వారీగా తొలగించ మని ప్రభుత్వాన్ని కోరతామన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటు తప్పని సరిగా ఈ ఏడాది కన్నా తగ్గుతుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. రూ.1.86 లక్షల కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం వదులుకుని గ్లోబల్‌ ఆర్థిక సంక్షోభం నుంచి రక్షించటం కోసం మూడు సార్లుగా పారిశ్రామిక రంగానికి ఉద్దీపనల ను అందించిన సంగతి తెలిసిందే. దీని వల్ల ప్రభుత్వ బడ్జెట్‌లో లోటు గతేడాది ఉన్న 6.2 శాతం నుంచి ఈ ఆర్థ్ధిక సంవత్సరానికి 6.8 శాతానికి పెంచుకొవాల్సి వచ్చింది. పరిశ్రమలు ఉద్దీపనల తొలగింపును అంతగా ఇష్టపడటంలేదనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్‌ లోటు పెరిగి పోవ టాన్ని తగ్గించాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. ఇప్పటికే 7 శాతంపైన ఆర్థిక వృద్ధి చేరుతుందని, వచ్చే ఏడాది 8 శాతం వృద్ధి అవకాశాలు న్నాయన్నారు.

ప్రభుత్వ పాలసీలే వ్యవసాయ సంక్షోభానికి కారణం

ప్రభుత్వ పాలసీలే వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలో నెట్టేస్తున్నాయ ని, వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ వ్యవసాయ రంగ వృద్ధి ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చని ప్లానింగ్‌ కమిషన్‌ సభ్యుడు ప్రొఫెసర్‌ అభిజిత్‌ సేన్‌ తెలిపారు. అసోచామ్‌ గ్రీన్‌ రివల్యూషన్‌ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ కరువూ కాటకాల వల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్‌ పంట పూర్తిగా దెబ్బతినిపోగా, వచ్చే రబీసాగు దిగుబడి కూడా అధిక ఉష్ణోగ్రతల వల్ల మందగించ నుందని తెలియజేశారు. ఈ కారణాల రీత్యా 2010-11 లోనూ దేశీయ వ్యవసా య రంగం వృద్ధి ప్రోత్సాహకరంగా ఉండకపోవ్చని ఆయన తెలిపారు. రానున్న కాలంలో వ్యవసాయం రంగంతలో టెక్నాలజీ పాత్రను మరింత గా పెంచేందకు గాను దేశ వ్యాప్తంగా ఉన్న 600 జిల్లాల కు సుమారు రూ.6000 కోట్లను ప్రభుత్వం కేటాయించ నుందని వివరించారు. ప్రభుత్వ పాలకులు వ్యవసాయ రంగంపై సరైన శ్రద్ధ వహించకపోవడం వల్లే వ్యవసాయోత్పత్తులు మందగిస్తు న్నాయని ఎంఎస్‌ స్వామి నాధన్‌ చెప్పిన మాటలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇదిలాఉండగా ఈ ఆర్థిక సంవత్సరంలో (2009-10) వ్యవసాయ రంగ వృద్ధి కేవలం 2 శాతంగా మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందని అసోచామ్‌ ప్రెసిడెంట్‌ స్వాతి పిరమల్‌ తెలియజేశారు.

0.2 శాతం తగ్గనున్న వ్యవసాయోత్పత్తులు : సిఎస్‌ఒ

ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగ ఉత్పత్తులు 0.2 శాతం తగ్గే అవకాశం ఉందని సెంటర్‌ స్టెటస్టికల్‌ ఆర్గనైజేషన్‌ (సిఎస్‌ఒ) అంచనా వేస్తుంది. కరువు, వరదలు, వాతావరణంలో మార్పులు తదితర కారణాల వల్ల ఖరీఫ్‌ పంట దిగుబడి కూడా క్షీణించనుం దని పేర్కొంది. దీంతో 2009-10 దేశీయ జిడిపిలో వ్యవసాయ రంగం 0.2 శాతం మందగింపును నమోదు చేసుకోనుందని ఆ సంస్థ వెల్లడించింది. అంతకుముందు ఏడాది (2008-09)లో వ్యవసాయ రంగ వృద్ధిరేటు 1.6 శాతంగా ఉన్నట్లు తెలియజేసింది. గత నెలలో రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా జరిపిన ద్రవ్యపరపతి మూడో త్రైమాసక సమీక్షలో వ్యవసాయ రంగం వృద్ధి 2009-10 జడిపి వృద్ధిలో సున్నా శాతం నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయని వివరించిన సంగతిని సిఎస్‌ఒ ఈ సందర్భంగా గుర్తు చేసిం ది.ఏదేమైనా ఈ ఆర్థిక సంవత్సరంలో ఆహారోత్ప త్తులు, ఆయిల్‌ విత్తనాల ఉత్పత్తి ఏకంగా ఐదు శాతం నుండి ఎనిమిది శాతం వరకూ క్షీణించనున్నాయని వివరించింది. అదేవిధంగా చక్కెర ఉత్పత్తి కూడా ఇదే కాలంలో 11.8 శాతం తగ్గుదలను నమోదు చేసుకో నుందని తెలిపింది. ఇదిలా ఉండగా కాటన్‌ ఉత్పత్తి మాత్రం ఈ సమయంలో 0.2 శాతం పెరగనుందని ఆ సంస్థ అంచనా వేస్తోం ది. అలాగే హార్టికల్చరల్‌ ఉత్పత్తులైన పళ్ళు, కూరగాయల దిగుబడి సైతం 2.5 నుండి 4.8 శాతం పుంజుకోను న్నాయని వివరించింది.

గతేడాది చాలా చెడ్డ సంవత్సరం. 1972 తర్వాత అంతటి కరువు పరిస్థితులు దేశంలో గత సంవత్సరం చోటుచేసు కున్నాయని తెలియ జేసింది. పూర్తి వర్షాభావ పరిస్థితులు నెలకొన డం వల్ల ఖరీఫ్‌ పంట దిగుబడి తగ్గడంతో 13 మిలియన్‌ టన్నుల ఆహారోత్ప త్తులను నష్టపోవా ల్సి వచ్చిందని పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో వ్యవసాయ రంగ వృద్ధి 2009-10లో 0.2 శాతానికి చేరనుందని ఆ సంస్థ తెలిపింది.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్