మూడో జనరేషన్ టెలికమ్ స్పెక్ట్రమ్ ఆక్షన్‌లు ఎప్పుడు నిర్వహించాలని, అసలు నిర్వహిం చేట్లైతే ఎన్ని ఉండాలని ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతుండగా ఇంత లోనే టెలికం నియంత్రణ సంస్థ ట్రారు అప్పుడే నాల్గో జనరేషన్ (4జి) స్పెక్ట్రమ్‌లపైన చర్చలను సోమవారం ప్రారంభిం చింది. 4జి టెక్నాలజీలో డౌన్‌లోడ్‌ల ను చాలా వేగంగా చేయొచ్చని దీంతో అల్ట్రా బ్రాడ్‌బాండ్, హై డెఫినిషన్ వీడియోను ఇతర సేవలతో పాటు అందించొచ్చని చెబుతున్నారు. ఈ సంద్భంగా ట్రారు చైర్మన్ జె.ఎస్. శర్మ మాట్లాడుతూ 4జి టెక్నాలజీ సంబంధిం చిన ప్రాసెస్‌ను మొదలుపెట్టామన్నారు. దీని వివరాలతో కూడిన పత్రాలను పరిశీలించి వివిధ అంశాలను అధ్యయనం చేస్తున్నట్లు కూడా వివరించారు. నిజమే 3జి టెక్నాలజీ బాగా ఆలస్యం అయింది, అదే పరిస్థితి 4జి టెక్నాలజీకి రాకుండా చూస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే ఇతర దేశాలు 4జిని పట్టుకొనే క్రమంలో ఉండగా మనం మాత్రం ఎందుకు ముందే చర్యలను చేపట్టకోడదని వివరించారు. త్వరలోనే 4జి కన్సెల్‌టేటింగ్ పేపర్లను విడుదల చేయనున్నట్లుగా తెలిపారు.