చిన్న కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి ఈ ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు రెట్టింపును పెంచుకొనే క్రమంలో ఉన్నట్లుగా సోమవారం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో 80వేల యూనిట్లను ఎగుమతి చేసిన మారుతి ఈ ఆర్థిక సంవత్సరంలో 1.6 లక్షల యూనిట్లను ఎగుమతి చేసే దిశగా పనిచేస్తున్నట్లు కంపెనీ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ మార్కెటింగ్, సేల్స్ మయంక్ పరేఖ్ విలేకరులకు వివరించారు. ముఖ్యంగా ఎగుమతులు అత్యధికంగా పెరగటానికి ఉపకరించిన ముఖ్యమైన అంశంగా ఎ-స్టార్ మోడల్‌ను తెలిపారు. దీనిని విడుదల చేసిన పదకొండు నెలల కాలంలోనే ఒక లక్ష యూనిట్లను విక్రయించగలిగామని వివరించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెండు లక్షల యూనిట్లను ఎగుమతి చేయగలమనే లక్ష్యాన్ని కూడా తెలియజేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా అమ్మకాలు 20 నుంచి 22 శాతానికి పెరుగుతాయని పేర్కొన్నారు. ఇప్పటి దాకా మారుతి 8 లక్షల యూనిట్లను అమ్మగా దేశంలో 7.22 లక్షల యూనిట్లను విక్రయించినట్లు వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల కార్లను ఉత్పత్తి చేసి 8.4 లక్షల కార్లను అమ్ముతామనే ధీమాను వ్యక్తం చేశారు.
స్వల్పంగా తగ్గిన ఆహార ద్రవ్యోల్బణం
భద్రతా మండలితోను విభేదించిన డిప్
రాష్ట్ర మార్కెట్లోకి న్యూ ఫోర్డ్ ఫిగో 'స్మార్టర్'
ఫిబ్రవరిలో 46 శాతం పెరిగిన చైనా ఎగుమతులు
30 శాతం మార్కెట్ వాటా లక్ష్యంగా 'సోనీ'
3 వేల కోట్ల డాలర్లకు గ్లోబల్ మూవీ బాక్సాఫీస్
టోల్ ట్యాక్స్ వసూళ్లు 1495 కోట్లు !
2 రోజుల్లోనే 100 వోక్స్వాగన్ పోలో కార్లు బుకింగ్