మూడేళ్లలో 100 స్టోర్లు

  • ఎజిఎల్‌ టైల్స్‌ ఛైర్మన్‌

రానున్న మూడేళ్లలో వంద స్టోర్లను ఏర్పాటు చేయాలని ఎజిఎల్‌ టైల్స్‌ వాల్డ్‌ లక్ష్యంగా పెట్టుకుంది. గురువారం సికింద్రాబాద్‌లో ఈ సంస్థ ఎస్‌ఎస్‌వి సెరమిక్స్‌ సంయుక్త భాగస్వామ్యంతో ఎక్స్‌క్లూజివ్‌ షోరూంను ప్రారంభించింది. ఈ సందర్బంగా ఆసియన్‌ గ్రానిటో ఇండియా లిమిటెడ్‌ ఛైర్మన్‌ కమలేష్‌ పటేల్‌ విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో తాము 23 ప్రత్యేక షోరూంలను కలిగి ఉన్నామన్నారు. ఈ ఏడాది మరో ఎనిమిది స్టోర్లను ఏర్పాటు చేయనున్నామని, ఇందులో గుంటూరు, విజయవాడ పట్టణాలకు విస్తరిస్తామన్నారు. టైల్స్‌ మార్కెట్‌లో తమకు 6-7 శాతం వాటా ఉందన్నారు. 2011-12 ఆర్థిక సంవత్సరంలో 30 శాతం వృద్ధితో రూ.620 కోట్ల టర్నోవర్‌ సాధించామని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.850 కోట్ల రెవెన్యూ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తమకు దేశంలో ఐదు సెరమిక్‌ తయారీ పరిశ్రమలున్నాయని చెప్పారు.