టాటా మోటార్స్‌ అమ్మకాల్లో 26% వృద్ధి

గత ఆర్థిక సంవత్సరం మార్చిలో టాటా మోటార్స్‌ అంతర్జాతీయ అమ్మకాల్లో 26 శాతం పెరుగుదల చోటు చేసుకుంది. గత మార్చిలో 1,39,655 వాహనాలను ఆ సంస్థ అమ్మకాలు చేసింది. అంతక్రితం ఏడాది ఇదే నెల అమ్మకాలతో పోల్చితే 26% వృద్ధి ఉందని ఆ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. 2011-12 ఆర్థిక సంవత్సరంలో 12,52,173 యూనిట్లు విక్రయించామని, అంతక్రితం ఆర్థిక సంవత్సర అమ్మకాలతో పోల్చితే 2011-12లో 16 శాతం పెరుగుదల ఉందని తెలిపింది. అంతర్జాతీయ వాణిజ్య వాహనాల అమ్మకాల్లో 12 శాతం, ప్రయాణీకుల వాహనాల విక్రయాల్లో 41 శాతం వృద్ధి చోటు చేసుకుందని తెలిపింది.

Sorry

java.lang.NullPointerException