
అమెరికా, యురోపియన్ ఆర్థిక నియంత్రణదారులు వ్యవహరించిన మాదిరిగానే భారత దేశంలోని బ్యాంకులకు 'ఒత్తిడి పరీక్షలు' నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నెలకొన్న సందర్భంలో బ్యాంకుల క్రెడిట్, వడ్డీ రేటు ముప్పులను పర్యవేక్షించేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) ప్రాధమిక పరీక్షలు నిర్వహించినట్లు తెలిపిందని ఒక ఆంగ్ల పత్రిక పేర్కొంది. దేశ బ్యాంకింగ్ వ్యవస్థ పట్ల గల విశ్వాసాన్ని యినుమడింప చేసేందుకు మరిన్ని అధునాతన పరీక్షలు నిర్వంచనున్నట్లు ఆర్‌బిఐ తెలిపింది. ములధనం, ద్రవ్యలభ్యత, యితర ప్రమాణాలను సమీక్షించేటప్పుడు భారత్ దీనిని అధ్యయనం చేసిందని ఆర్‌బిఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు పేర్కొన్నట్లు ఆ పత్రికలో పేర్కొన్నారు. అయితే దీనిపై వ్యాఖ్యానించేందుకు ఆర్‌బిఐ ప్రతినిధి అందుబాటులో లేరు. భవిష్యత్తులో సంక్షోభం ఎదురైనప్పుడు నెలకొనే పరిస్థితిని ఊహిస్తూ ఆర్థికపరమైన ఒత్తిళ్ళను బ్యాంకులు ఎంతమేర తట్టుకోగ లవనే విషయాన్ని తెలుసు కునేందుకు బ్యాంకు బ్యాలెన్స్ షీట్లను పరిశీలించడంతో సహా భారత్ మరిన్ని 'ఒత్తిడి పరీక్షలు' నిర్వహించాల్సి వుందని గవర్నర్ అన్నట్లు ఆ పత్రిక పేర్కొంది. యూరప్ ప్రాంతంలోని ప్రముఖ ఆర్థిక సంస్థలకు నిర్వహించిన ఒత్తిడి పరీక్షల ఫలితాలు విడుదల యిన కొద్ది రోజుల తరువాత యీ వ్యాఖ్యలు వెలువడ్డాయి.
లండన్‌కు చెందిన యూరోపియన్ బ్యాంకింగ్ సూపర్‌వైజర్స్ కమిటీ నిర్వహించిన ఒత్తిడి పరీక్షల్లో యూరోపియన్ యూనియన్‌కు చెందిన 91 సంస్థలకు గాను ఏడు సంస్థలు విఫలమైనట్లు గత శుక్రవారం వార్తలు వచ్చాయి. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభ సమయంలో ద్రవ్యలభ్యత కొరత తీవ్రంగా వున్నప్పటికీ భారత దేశపు ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంకులు చక్కటి పనితీరు ప్రదర్శించాయి. అయితే ఆ సంక్షోభ సమయంలో ప్రైవేటు రంగ దిగ్గజం ఐసిఐసిఐ బ్యాంకు ఒక్కటే ద్రవ్యలభ్యత కోసం ఆర్‌బిఐని సంప్రదించడం జరిగింది. ప్రభుత్వ రంగంలోని కొన్ని చిన్న బ్యాంకులలో మూలధనాన్ని చొప్పించడం కోసం ప్రపంచ బ్యాంకు నుండి ఆర్‌బిఐ రుణం తీసుకోవలసి వచ్చింది. 2009లో అమెరికా ఒత్తిడి పరీక్షలు నిర్వహించి నప్పుడు ఆ దేశంలోని 19 అతిపెద్ద బ్యాంకుల్లో 10 బ్యాం కులు తమకు ఏర్పడే అదనపు నష్టాలను భర్తీ చేసుకు నేందుకు సంయుక్తంగా 7,500 కోట్ల డాలర్ల మేర అదనపు నిధులు కోరాల్సిన ఆవశ్యకతను గుర్తించడం జరిగింది.
49శాతం తగ్గిన జులై ఎఫ్‌డిఐ
ప్రత్యక్ష పన్నుల నియమావళి పెట్టుబడులతో ముడిపడ్డ పన్ను రాయితీలు
తొలి 20 విజేతలను ప్రకటించిన నెట్ 2 మొబైల్ డాట్‌కామ్
వర్జిన్ ఎస్టిడి నిమిషానికి 40పైసలు
సంతృప్తి చెందని భారతీయ నిపుణులుసంతృప్తి చెందని భారతీయ నిపుణులు
ప్రత్యేక ప్యాకేజి అందిస్తున్న 'వీడియోకాన్'
ఆకాష్ మార్కెటింగ్ వారి 'ఆస్త్రా సాంబ్రాణి'
బ్యాంకులలో ఆస్తుల నాణ్యత తగ్గుతోంది