'కంపెనీ' గీతాలు

రమాశ్రీ క్రియేషన్స్‌ పతాకంపై వీరు కె.దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'కంపెనీ'. లక్కరాజు రాజేశ్వరి నిర్మాత. సురేష్‌, స్వాతివర్మ, మురళీకృష్ణ, జీవా తదితరులు నటించారు. సంగీతాన్ని వీరు.కె. అందిస్తున్నారు. ఆడియో ప్రసాద్‌ల్యాబ్‌లో విడుదలైంది. ఆవిష్కర్త అచ్చిరెడ్డి మాట్లాడుతూ...'పాటలు కొత్తగా అనిపించాయి. 500 కోట్ల స్కాం చుట్టూ అల్లుకున్న సినిమాగా దర్శకుడు ఉత్కంఠభరితంగా తెరకెక్కించాడు' అని తెలిపారు. వీరు కె. మాట్లాడుతూ...'ఇప్పటికీ 14 సినిమాలు చేశాను. వాటన్నింటి ద్వారా రాని గుర్తింపు ఈ చిత్రం ద్వారా వస్తుందనే నమ్మకముంది. యదార్థ సంఘటన ఆధారంగా సినిమాను రూపొందించాను. పోస్ట్‌ప్రొడక్షన్స్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో విడుదల చేయనున్నా'మని తెలిపారు.

Publiture