వచ్చేవి 15 లక్షలు, పోయేది అరకోటి

  • ఐరోపా-భారత్‌ స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం-3

చిల్లర వర్తకంలో విదేశీ బడా కంపెనీలను అనుమతిస్తే మూడు సంవత్సరాలలో కోటి ఉద్యోగాలు వస్తాయని మన కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఫ్రాన్స్‌కు చెందిన కారీ ఫోర్‌ కంపెనీ 2010లో వేసిన అంచనా ప్రకారం విదేశీ కంపెనీలను అనుమతించిన ఐదు సంవత్సరాల కాలంలో సూపర్‌ మార్కెట్ల విస్తీర్ణం 52 లేదా 60 కోట్ల అడుగుల మేరకు విస్తరిస్తుందని, 15 లక్షల ఉద్యోగాలు అదనంగా వస్తాయని పేర్కొన్నది. ప్రస్తుతం సంఘటిత రంగంలోని విదేశీ, స్వదేశీ కంపెనీల దుకాణాల విస్తీర్ణం 31 కోట్ల చదరపు అడుగులున్నట్లు మన కేంద్ర ప్రభుత్వం స్వయంగా అంచనా వేసింది. అంటే కొత్తగా మరో 21 లేదా 29 కోట్ల అడుగుల మేరకు కొత్త దుకాణాలు వస్తాయి. ఇవి కోటి ఉద్యోగాలు తెచ్చే సంగతేమోగానీ ఐరోపా మానవహక్కుల సంస్థలు మాత్రం ఐదు సంవత్సరాల కాలంలో నికరంగా 11 నుంచి 49 లక్షల వరకూ ఉన్న ఉద్యోగాలు పోతాయని తమ తాజా విశ్లేషణలో పేర్కొన్నాయి. వీరిలో అత్యధికులు మహిళలే అని కూడా తెలిపారు.

మన ప్రభుత్వం చేయించిన అధ్యయనం ప్రకారమే ఇప్పటికే సింగిల్‌, హోల్‌ సేల్‌ రంగంలో విదేశీ బడా కంపెనీలను అనుమతించిన కారణంగా 21 నెలల వ్యవధిలో అసంఘటిత రంగంలోని హోల్‌సేల్‌ దుకాణాల లాభం 14 శాతం, టర్నోవర్‌ 15 శాతం పడిపోయింది. పరిసరాల్లోని 151 చిల్లర దుకాణాలు మూతబడ్డాయి. అవి 4.2 శాతంగా ఉన్నట్లు తేలింది. సింగిల్‌ బ్రాండు అంటే ఆదిదాస్‌, రీబాక్‌, లెవీస్‌, నైక్‌, బెంటన్‌ వంటి కేవలం తమ బ్రాండ్‌ వస్తువులను మాత్రమే అమ్మేవి. ఇప్పుడు అనుమతించిన మెట్రో, వాల్‌మార్ట్‌ వంటి హోల్‌సేల్‌ దుకాణాలలో ఇలాంటి అన్ని కంపెనీల వస్తువులనూ విక్రయించుకోవచ్చు. అదే విధంగా అన్ని రకాలను అమ్మే చిల్లర దుకాణాలను కూడా అనుమతించాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం ప్రజాగ్రహంతో తాత్కాలికంగా వెనక్కు తగ్గిన విషయం తెలిసిందే.

ప్రపంచ బడా చిల్లర దుకాణాల కంపెనీలు భారత్‌లో వస్తువులను అమ్మడమే గాక భారత్‌లో అదే విధంగా విదేశాలకు ఎగుమతి చేసే ఆహార పరిశ్రమ(ఫుడ్‌ ప్రాసెసింగ్‌)లను ఏర్పాటు చేస్తాయని భారత ప్రభుత్వం ఆశిస్తున్నదని ఐరోపా మానవ హక్కుల సంస్థలు పేర్కొన్నాయి. కారీఫోర్‌ కంపెనీ తన నివేదికలో ఇదే రంగుల కలను చూపింది. అనేక సందర్భాలలో చైనా ఉదాహరణను అది ప్రస్తావించింది. అక్కడ వాల్‌మార్ట్‌ కంపెనీ తన గొలుసు కట్టు సూపర్‌ మార్కెట్లలో విక్రయించేందుకు ఏటా 2,000 కోట్ల డాలర్ల మేరకు చైనా నుంచి వస్తువులను సేకరిస్తున్నది. అయితే భారత్‌లో ప్రస్తుతం అటువంటి అవకాశాలు లేవు. కేవలం రెండు శాతమే ఫుడ్‌ ప్రాసెస్‌ భారత్‌లో జరుగుతోంది. అది కూడా 37 శాతం డైరీ ఉత్పత్తులున్నాయి. మాంస ఉత్పత్తులు కేవలం ఒక్క శాతమే. అదే చైనాలో 2009 నాటికే 40 శాతం ఉంది. ప్రపంచ సూపర్‌ మార్కెట్లలో ఎక్కువగా అమ్మేది ప్రాసెస్‌ చేసిన ఆహారం. వ్యవసాయంపై భారత్‌లో చేస్తున్న అతి తక్కువ ఖర్చు కారణంగా ఇతర దేశాలతో పోల్చితే భారత్‌ అననుకూల స్థితిలో ఉంది. ధనిక దేశాలు ఏ దేశంలోనైతే తమ దుకాణాలను తెరుస్తాయో అక్కడ సంబంధాలను సుస్థిరం చేసుకొనేందుకు కాలం గడిపే ఎత్తుగడగా 'ఎగుమతు'ల గురించి చెబుతుంటాయని జర్మనీ వ్యవసాయ వాణిజ్య అంతర్జాతీయకరణ గురించి విశ్లేషించిన ఎర్నెస్ట్‌ అండ్‌ ఎంగ్‌ కంపెనీ తన నివేదికలో పేర్కొన్నది. విదేశీ కంపెనీలు మన దేశంలోని చిన్న, మధ్యతరహా సంస్థల నుంచి 30 శాతం వస్తువులను కొనుగోలు చేసి తమ దుకాణాల్లో అమ్ముతాయని ప్రభుత్వం ప్రకటించింది. అయితే మన దేశంతో సంప్రదింపులలో కారీ ఫోర్‌ కంపెనీ 90 శాతం కొనుగోలు చేస్తానంటూ పంచపాండవులంటే మంచం కోళ్ల మాదిరి అనేక మినహాయింపులను షరతులుగా పెట్టింది. అభివృద్ధి చెందుతున్న దేశాల పరిశోధన, సమాచార వ్యవస్థ డైరెక్టర్‌ జనరల్‌ విశ్వజిత్‌ దార్‌ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిల్లర వర్తకులు తమ అవసరాల్లో ఎక్కువ భాగం వెలుపలి నుంచే కొనుగోలు చేస్తారు. తాము నాణ్యత విషయంలో రాజీ పడబోమని చెబుతాయి.

పెట్టుబడులు వస్తాయంటూ మిమ్మల్ని కట్టి పడవేసేందుకు ప్రయత్నిస్తాయి. సమర్థులైన కొద్ది మంది రైతులు మాత్రమే వాటివలన లబ్ధి పొందుతారు అని చెప్పారు. అంతర్జాతీయంగా గోధుమలు, బియ్యం ధరలు తగ్గుతుండగా భారత్‌లో పెరుగుతున్నాయి. 2010, ఆగస్టు నుంచి 2011, ఆగస్టు వరకూ న్యూఢిల్లీలో బియ్యం ధర 6.1 శాతం, గోధుమ ధర 7.1 శాతం పెరిగాయి. న్యూఢిల్లీ కేంద్రంగా ఉన్న ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎకనమిక్‌ గ్రోత్‌ సంస్థ ప్రతినిధి సుఖపాల్‌ సింగ్‌ తన విశ్లేషణలో అర్జెంటీనా, మెక్సికో, నికరాగువా, థారులాండ్‌, వియత్నాం దేశాలలోని సూపర్‌ మార్కెట్లలో కంటే Publiture