ఇటీవల ఒక టీవీ కార్యక్రమంలో 'పోరాటయోధులు దీనస్థితి' అనే కార్యక్రమంలో తెలంగాణా సాయుధ పోరాట యోధుల దయనీయ స్థితి చూపించారు. వారికి పింఛను ఏర్పాటు చేయడానికి ఒక కమిటీ వేసినట్లు, వారు తిరిగితిరిగి వేసారిపోయినట్లు తెలిసింది. అలాంటి వారి కోసం, కమ్యూనిస్టు పార్టీకి యావదాస్తిని త్యాగం చేసి దయనీయ స్థితిలో ఉన్నవారి కోసం ఏదన్నా వృద్ధాశ్రమం ఏర్పాటు చేయవచ్చు కదా! ఆలోచించగలరు.
రణధీర్, హైదరాబాద్
తెలంగాణా పోరాట యోధుల పింఛను విషయంలో అధికార పార్టీ అనేక అక్రమాలకు, అన్యాయాలకు పాల్పడింది. పోరాట యోధుల్ని, త్యాగధనుల్ని నిర్లక్ష్యం చేసి తమ వారికి అర్హత ఉన్నా, లేకున్నా పింఛను ఏర్పాటు చేసుకుంది. ఈ అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటయోధులు స్వాతంత్య్ర సమరయోధుల కమిటీగా ఏర్పడి ఎంతో కాలంగా పోరాడుతున్నారు. నాడు నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాడినట్లే నేడు కేంద్ర పాలకులకు వ్యతిరేకంగా నిర్విరామంగా కృషి చేస్తున్నారు. అయినా కేంద్రం కనికరించడం లేదు. ఎన్నో విజ్ఞప్తులు, రాయబారాలు నడిపినా ప్రయోజనం లేకపోయింది. కొంతమందికి సాధించుకున్నా ఇంకా అనేక మంది ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. వామపక్ష పార్టీలు, ఎంపీలు వారికి అండగా ఉన్నారు. ఈ కృషిని కొనసాగిస్తూనే మీరన్నట్లుగా జీవనభృతి కూడా లేకుండా దినదిన గండంగా బతుకుతున్న వారి గురించి పార్టీ సీరియస్‌గానే తీసుకుంటుంది. మీ సలహాను కూడా దృష్టిలో ఉంచుకుని ఏం చేయాలో ఆలోచిస్తుంది. ఇప్పటికే చండ్రరాజేశ్వరావుగారి పేరు మీద ఒక వృద్ధాశ్రమాన్ని నడుపుతున్నారు. కమ్యూనిస్టు పార్టీలకు ఇలాంటి ఆశ్రమాలు నడపడం ప్రయాసతో కూడిన పని. పాలకులు నిధులివ్వరు. మరల ప్రజలపైనే ఆధారపడాలి. ఒకవైపు పాలకుల వివక్షపై పోరాడుతూనే ఇలాంటి ప్రత్యామ్నాయాల గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది.
మార్క్సిజం సైన్సా? సిద్ధాంతమా? ఏది సైన్స్? ఏది సిద్ధాంతం? ఈ రెండింటికీ ఉన్న తేడా ఏమిటి? సంబంధం ఏమిటి?
- పల్లా కొండలరావు, రాయనపేట, ఖమ్మంజిల్లా
సృష్టి అంతర్రహస్యాలను కనుగొనేదే సైన్సు (విజ్ఞానం). ఒక ప్రతిపాదన ప్రయోగానంతరం ధృవపడిన తర్వాతనే సైన్సుగా మారుతుంది. సైన్సు అనేక విడివిడి అంశాలను పరిశీలిస్తుంది. వాటి మధ్య సాధారణత్వాన్నే సిద్ధాంతం అంటారు. అది ప్రకృతి రహస్యాలను కనుగొనేదైనా, సామాజిక అంశాలను కనుగొనేదైనా సరే. సైన్సు, సిద్దాంతం రెండూ విడదీయరాని అంశాలు. ఇక్కడ మీరు సిద్ధాంతం (సైన్సులో థియరీ అంటారు) అనేది ఐడియాలజీ (సిద్ధాంత భావజాలం) గురించి అడిగి ఉంటే అది సామాజిక అంశాలకు సంబంధించినదై ఉంటుంది. సమాజాన్ని మార్చడానికి ప్రతిపాదించిన సిద్ధాంతాలు చాలా ఉన్నాయి. వాటిని అమలు చేస్తే రుజువై మంచి ఫలితాలు వచ్చినప్పుడు దాన్ని శాస్త్రీయ సిద్ధాంతం అంటారు. అందుకే దాన్ని సామాజిక శాస్త్రం అంటారు. అంటేసమాజాన్ని
పరిశీలించడం కూడా సైన్సే. అలాంటి ఒక ఉత్తమ సైన్సు మార్క్సిజం. అందుకే మార్క్సిజాన్ని శాస్త్రీయ సిద్ధాంతం అంటారు. సమాజం మారకుండా అలాగే నిలబెట్టడానికి తిరోగామి శక్తులు కృషి చేస్తుంటాయి. వాటిని కూడా వారు సిద్ధాంతమనే అంటారు. అయితే మార్క్సిజానికి వచ్చిన ప్రాచుర్యం వాటికి రాలేదు. అందుకే మార్క్సిజంపై దాడి చేయడానికి వారు సిద్ధాంతమనే అంశంపైనే దాడికి దిగారు. సిద్ధాంత రాహిత్యమనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. చంద్రబాబులాంటి వారు గతంలో దీన్ని పట్టుకునే ఏ ఇజాలూ లేవు, టూరిజం తప్ప అని అవహేళన చేశారు. ఇప్పుడాయనే సిద్ధాంతాల గురించి మాట్లాడుతున్నారు. అంటే సిద్ధాంత రాహిత్య సిద్ధాంతం ఓడిపోయిందనే అర్థం. కాబట్టి, సిద్ధాంతం ఓ సైన్సుగా ఉన్నంత కాలం దానికి ఓటమి ఉండదు. మార్క్సిస్టు సిద్ధాంతం దాన్నే రుజువు చేసింది.
రాష్ట్ర అసెంబ్లీ కానీయండి, పార్లమెంటు కానీయండి సరిగ్గా పని చేయడం లేదు కదా? సిపిఎం చిన్నది. దాని వాయిస్ అక్కడ వినిపించడానికి కూడా అవకాశం ఉండటం లేదు. అదీగాక పార్లమెంటులో గానీయండి, అసెంబ్లీలోగానీయండి ధనవంతులు, పెట్టుబడిదారులు సభ్యులుగా వస్తున్నారు. పెట్టుబడిదార్ల ప్రయోజనాలను కాపాడేందుకే ఈ సభలను వాళ్లు వినియోగించు కుంటున్నారు. గతంలో ఎన్నడూ లేనన్ని సమస్యలు ఇప్పుడున్నాయి. రోజురోజుకీ నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి. వాటిపై అసలు చర్చలే ఉండడం లేదు. ఈ సమావేశాల పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా అవుతున్నది గదా! మరి అలాంటప్పుడు ప్రజల సొమ్ముతో నడిచే పార్లమెంటు, అసెంబ్లీలు ప్రజల సమస్యలను ప్రతిబింబించనప్పుడు మనం ఎందుకు ఆ ఎన్నికలలో పాల్గొనాలి?
- వెంకటేశ్వరరావు ఒబిలినేని
ఇలా అనుకునే నక్సలైట్లు మొదట ఎన్నికలను బహిష్కరించారు. దాని వల్ల ఉపయోగం లేదని అనుభవం ద్వారా తెలుసుకుని క్రమంగా పాల్గొంటున్నారు. మావోయిస్టులు తప్ప ఇప్పుడు దాదాపు అన్ని గ్రూపులూ ఎన్నికలను వేదిక చేసుకుంటున్నాయి. మీరన్నట్లు అసెంబ్లీ, పార్లమెంటులు ఈ వ్యవస్థను నడిపించే రాజకీయ వేదికలు. అవి పెట్టుబడిదారులు, భూస్వాముల చేతుల్లో బలమైన సాధనాలుగా ఉన్నాయి. ఇతరులు, అందునా కమ్యూనిస్టులు కూడా ఎన్నికల్లో పాల్గొ నడాన్ని ఏ కారణం చేతనైనా సరే పాలకులు అనుమతి స్తున్నారు. భిన్నాభిప్రాయాలను సహిస్తున్నారు. వారి వర్గ పాలనలకు తక్షణం ప్రమాదం రానంతవరకూ వారు ఇలా అనుమతిం చొచ్చ