ప్రభుత్వ విధానాలపై సమ్మె సైరన్‌

విధుల్లో తలమునకలై ఉండే ఉద్యోగులు వీధుల్లో కొస్తున్నారు. కంప్యూటర్‌ కీబోర్డులపైనా, కార్యాలయ దస్త్రాలపైనా కదలాడే వారి చేతులు రేపటి సార్వత్రిక సమ్మెకోసం పిడికిలి బిగిస్తున్నాయి. ప్రభుత్వ కార్యకలాపాలు చక్కదిద్దేవారు ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నారు. కష్టపడినా... కనీస వేతనం దక్కని వైనం... ఎన్నాళ్లు చేసినా గ్యారంటీ లేని ఉద్యోగం, చాలీ చాలని జీతాలతో, నిరంతర అభద్రతతో అలమటింపజేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌, కంటింజెంట్‌ పద్ధతులు, పబ్లిక్‌ సెక్టార్‌ను నిర్వీర్యం చేసే ప్రభుత్వ విధానాలు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక లోకాన్ని ఐక్యంజేస్తున్నాయి. ప్రభుత్వరంగ పరిరక్షణ కోసం, ఉద్యోగ భద్రతకోసం, పెన్షన్‌ గ్యారంటీ కోసం సమ్మెవైపు నడిపిస్తున్నాయి. సర్కారు విధానాలకు వ్యతిరేకంగా 28న జరిగే సార్వత్రిక సమ్మె ఒక హెచ్చరిక అని ఉద్యోగులంటున్నారు.

కనీస వేతనం అమలు చేయట్లేదు. ఇచ్చేది కూడా రెగ్యులర్‌గా ఇవ్వట్లేదు. ఏళ్ల తరబడిగా పనిచేస్తున్నా... సర్వీసు క్రమబద్ధీకరించట్లేదు. వేతనాలు పెంచట్లేదు. వారాంతపు సెలవులు, ప్రసూతి సెలవులు లేవు, ఇఎస్‌ఐ, పిఎఫ్‌, ఉద్యోగ భద్రత లాంటి చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించట్లేదు. ఇవీ... కాంట్రాక్టు, కంటింజెంట్‌, ఔట్‌సోర్సింగ్‌, పార్టుటైమ్‌ ఉద్యోగులు ఎదుర్కొంటున్న కామన్‌ సమస్యలు.

పబ్లిక్‌ సెక్టార్లో ప్రయివేటీకరణ విధానాలు... ప్రభుత్వ రంగంపట్ల సర్కారు నిర్లక్ష్యం... పెరిగిన సేవలకు అనుగుణంగా ఉద్యోగుల్ని నియమించకపోవడం.... రిటైరైన వారిస్థానాలు భర్తీ చేయకపోవడం. అవసరమైన అన్నిచోట్లా నియామకాలు చేపట్టకపోవడం. చేపట్టినా... కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతి అవలంభించడం. ఇప్పటికే పనిచేస్తున్న ఈ తరహా ఉద్యోగులను రెగుల్యరైజ్‌ చేయకపోవడం వంటి ప్రభుత్వ విధానాలు ఉద్యోగులను అభద్రతా భావానికి గురిచేస్తున్నాయి. ఇదే జరిగితే భవిష్యత్తులో ప్రభుత్వ రంగమనేదే లేకుండా పోయే ప్రమాదముందని రెగ్యులర్‌ ఉద్యోగులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ విధానాలను ప్రతిఘటించకపోతే ఉద్యోగరంగం ప్రమాదంలో పడుతుందని అంటున్నారు. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రీమియంతో సంబంధం లేని ఆరోగ్య విధానం అమలు చేయకపోవడం. దానిని ప్రయివేటు బీమా కంపెనీలకు అప్పజెప్తానడం, బిఎస్‌ఎన్‌ఎల్‌, సింగరేణి లాంటి సంస్థల్లో కూడా ప్రయివేటు పెట్టుబడుల్ని ప్రోత్సహించడం, ఉద్యోగుల సామాజిక భద్రతను హరించే పింఛన్‌విధానం తీసుకురావడం, చివరికీ సచివాలయంలో కూడా పొరుగు సేవల ఉద్యోగుల్ని నియమించడం వంటి ప్రభుత్వ నిర్ణయాలు ఉద్యోగులను, కార్మికులను సమ్మెబాట పట్టిస్తున్నాయి.

శాశ్వత ఉద్యోగుల నియామకాలు చేపట్టని తీరు, పెరిగిన ధరల్ని దృష్టిలో పెట్టుకొని హెచ్‌ఆర్‌ఎ రేట్ల పెంపు, ఉపాధ్యాయ నియామకాల్లో అంప్రెంటిస్‌ విధానంతోపాటు సర్వీసు పరమైన, విధానపరమైన అనేక సమస్యలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వానికీ, ప్రజలకూ మధ్య వారధిగా ఉంటూ, పాలనా వ్యవహరాలు చక్కదిద్దుతున్న తమపట్ల సర్కారు నిర్లక్ష్యం చూస్తుంటే... భవిష్యత్తుపై భరోసా సడలుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతియేటా ప్రభుత్వోద్యోగుల్ని తగ్గించాలన్న ప్రపంబ్యాంకు ఫార్ములాను ఏదోఒక రూపంలో అమలు చేసేందుకే మన ప్రభుత్వం ఉత్సాహం ప్రదర్శిస్తోందని అంటున్నారు. అందులో భాగంగానే ప్రభుత్వరంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని విమర్శిస్తున్నారు. ఇప్పటికే సచివాలయం సహా అన్ని ప్రభుత్వ రంగ శాఖల్లోనూ ప్రయివేటీకరణ అమలు అమలవుతోంది. ప్రభుత్వోద్యోగుల్ని క్రమంగా తొలగించే ఉద్దేశంతోనే తాత్కాలిక, కంటింజెంట్‌, ఎన్‌ఎంఆర్‌, అవుట్‌ సోర్సింగ్‌ వంటి పద్ధతులను సర్కారు చేపడుతోంది.

రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పద్నాలుగు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులున్నారు. కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌, కంటింజెంట్‌, ఎన్‌ఎంఆర్‌ తదితర పద్ధతుల్లో పనిచేస్తున్నవారు దాదాపు ఐదున్నర లక్షల మంది వుంటారని అంచనా. ఒక్క వేతన సవరణ మినహా తమకు ఎలాంటి మేలూ జరగలేదని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అంటున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ సిబ్బంది కొరత వుంది. ముఖ్యంగా నాలుగో తరగతి ఉద్యోగులు, జూనియర్‌ అసిస్టెంట్‌లు, టైపిస్టులు, డ్రైవర్లు వంటి కిందిస్థాయి సిబ్బంది లేకపోవడంవల్ల చాలా ఇబ్బందులు ఎదురౌతున్నాయి. ఎప్పటికప్పుడు రిటైరైనవారి స్థానాలు భర్తీ చేయకపోవడంవల్ల, వ్యవసాయశాఖ, ఆర్థికశాఖ, పశుసంవర్ధకశాఖ, సంక్షేమశాఖ, వైద్య ఆరోగ్య శాఖ, నీటిపారుదలశాఖ, కార్మికశాఖతోపాటు అనేక శాఖల్లో ఉద్యోగులు అభద్రతకు, పని ఒత్తిడికి గురౌతున్నారు.

ప్రభుత్వమే ప్రయివేటు సెక్టార్‌ను ప్రోత్సహించడంవల్ల ప్రభుత్వరంగం కుంటుపడుతోంది. బడాబాబులకు ప్రయోజనం చేకూర్చే విధానాల్లో భాగంగానే ప్రభుత్వం ఇలా చేస్తోంది. కొత్తగా ప్రభుత్వ రంగాలను ప్రోత్సహించకపోగా ఉన్నవాటిలో కూడా సరైన సౌకర్యాలు కల్పించట్లేదు. అవసరమైన సిబ్బందిని నియమించట్లేదు. ఇంకొన్నాళ్లు ఇవే విధానాలు అమలు జరిగి Publiture