ఎవడబ్బ సొమ్మని మన్మోహనా ...

చెట్లకు డబ్బులు కాయవని దేశ ప్రజలకు ఇంతవరకూ తెలియని తిరుగులేని సత్యాన్ని వెల్లడించినందుకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు 'కృతజ్ఞతలు' చెప్పాలి. సామాన్యులపై పెనుభారం మోపే పెట్రోలియం ఉత్పత్తుల ధరలను మార్కెట్‌ శక్తులకు అప్పగించేందుకుగాను యుపిఎ సర్కార్‌ ఇదంతా దేశం కోసమే అని చెప్పేందుకు బరితెగించింది. అందుకు ప్రధానే స్వయంగా జనాన్ని తప్పుదారి పట్టించేందుకు పూనుకున్నారు. ఒకవైపు భారాలకు వ్యతిరేకంగా దేశమంతటా హర్తాళ్‌, బందులు జరుగుతుండగా ఏం చేస్తారో చేసుకోండి చూద్దాం అనే రీతిలో చిల్లరవర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ద్వారాలు తెరిచే నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఇది దేశ పౌరులపై యుద్ధాన్ని ప్రకటించటమే. ప్రజలనుద్దేశించి శుక్రవారం రాత్రి ప్రధాని చేసిన ప్రసంగాన్ని చూస్తే యుద్ధంలో ముందు హతమయ్యేది నిజం అన్న విషయం మరోమారు రుజువైంది. బయటికొచ్చిన అనేక కుంభకోణాలపై మౌనమే మంచిదన్నట్లున్న ప్రధాని డీజిల్‌, వంటగ్యాస్‌, ఎఫ్‌డిఐపై నోరు విప్పారు. సౌమ్యుడు, మేధావి అన్న ముసుగులను పక్కన పడేసి నిజ స్వరూపాన్ని నిస్సిగ్గుగా ప్రదర్శించుకున్నారు.

1991లో కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నప్పుడు గట్టి చర్యలు తీసుకున్నందున బయటపడ్డామని ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే ఉందని ప్రధాని నమ్మబలుకుతున్నారు. అప్పుడు తీసుకున్నవి గట్టి చర్యలే అయితే ఇప్పుడు తిరిగి అలాంటి స్థితే ఎందుకు దాపురించినట్లు? దేశాన్ని రక్షించేందుకు సంస్కరణల పేరుతో అనుసరించిన విధానాలే నేడు సామాన్యుల కొంపముంచాయన్నది దాస్తే దాగని సత్యం. గత రెండు దశాబ్దాలలో ముఖ్యంగా గత పన్నెండు సంవత్సరాలలో జరిగిన పలు కుంభకోణాలలో మింగిన సొమ్ము రూ.80 లక్షల కోట్లని ఒక అంచనా. కాదు, రూ.91 లక్షల కోట్లని మరో అంచనా. ఇప్పుడు మనకున్న విదేశీ అప్పు 230 శత కోట్ల డాలర్లయితే 1948-2008 మధ్య మన దేశం నుంచి తరలిపోయిన మొత్తం 462 శత కోట్ల డాలర్లని గ్లోబల్‌ ఫైనాన్సియల్‌ ఇంటిగ్రిటీ సంస్థ ప్రకటించింది. గత మూడు సంవత్సరాలలో దేశ ఖజానాకు రావాల్సిన రూ.15 లక్షల కోట్లను కార్పొరేట్‌ సంస్థలకు వివిధ రూపాల్లో ఇచ్చిన రాయితీల వల్ల కోల్పోయినట్లు స్వయంగా బడ్జెట్‌ పత్రాల్లో ప్రభుత్వం పేర్కొన్నది. ఎవడబ్బ సొమ్మని ఇంత ధారపోసినట్లు మన్మోహనా అని జనం ప్రశ్నించాలి. ఏనుగులు దూరే కంతలను వదలి చీమలు దూరే సందులపై పడ్డట్లుగా దేశ ప్రజలందరికీ వర్తించే డీజిల్‌, వంటగ్యాస్‌ వంటి ఉత్పత్తులపై రూ.1,40,000 కోట్ల సబ్సిడీ ఇచ్చినందుకు పెడబొబ్బలు పెడుతున్నారు. వినియోగదారులకు 2010-11, 11-12 సంవత్సరాలలో కేంద్రం ఇచ్చిన చమురు సబ్సిడీ మొత్తం 1,24,500 కోట్లు కాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చమురుపై పన్నుల రూపంలో ముక్కుపిండి వసూలు చేసిన మొత్తం రూ.3,89,000 కోట్లు. పక్కా మోసకారి మాటలు కాకపోతే ఆమ్‌ ఆద్మీ పాలనంటే ఇదా? తినబోతే ఎద్దుల్లో, దున్నబోతే దూడల్లో మాదిరి మన కంటే ఎక్కువ ధరలున్న దేశాల గురించి చెప్పిన ప్రధాని తక్కువ ఉన్న దేశాలనెందుకు విస్మరించినట్లు? నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లు ఎక్కువ భాగం డీజిల్‌ను కేవలం ధనికులు తమ కార్లకు, పరిశ్రమలకు వాడుతున్నట్లు ఎలాంటి సంకోచం, వెనకా ముందూ చూడకుండా ప్రధాని పచ్చి అవాస్తవం చెప్పారు. డీజిల్‌ ధర పెంపు వల్ల సరకుల ధరలు పెరగడం అప్పుడే ప్రారంభమైంది. ప్రధాని వంటి పదవిలో ఉన్న వారు ఉన్నతంగా, హుందాగా మాట్లాడాలని ఎవరైనా కోరుకుంటారు. చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడులను అనుమతిస్తే చిన్న వ్యాపారులు అంతరిస్తారనటానికి ఆధారం లేదని ప్రధాని చిలుక పలుకులు పలికారు. సరిగ్గా ఆయన ప్రసంగిస్తున్న సమయంలోనే ప్రధాని ఆర్థిక సలహా మండలి అధ్యక్షుడు రంగరాజన్‌ హైదరాబాద్‌లో మాట్లాడుతూ చిన్న వ్యాపారులపై ప్రభావం ఉంటుందని చెప్పటాన్ని ఏమనాలి? ఆయనేమీ ప్రతిపక్ష పార్టీకి చెందిన వ్యక్తి కాదే.

ప్రయివేటు రంగం, అవినీతిపరులైన రాజకీయనాయకులు, వ్యాపారులు విదేశీ బ్యాంకుల్లో దాచుకుంటున్న ధనం ఏటేటా పెరుగుతోంది. బ్లాక్‌ మనీ గురించి ప్రతి ప్రధానీ కబుర్లు చెప్పటం తప్ప నిరోధానికి తీసుకున్న చర్య ఒక్కటీ లేదు. దేశం నుంచి అక్రమంగా తరలించిన సొమ్ములో విదేశీ బ్యాంకుల్లో దాచుకున్న డిపాజిట్ల మొత్తం 1995లో 36.4 శాతం ఉంటే 2009 నాటికి 54.2 శాతానికి పెరిగింది. ఈ కాలంలోనే బొగ్గు, స్పెక్ట్రం, చమురు, కామన్వెల్త్‌ క్రీడలు, గనులు, సెజ్‌ల పేరుతో భూముల పందేరం, ఇలా అనేక కుంభకోణాలు జరిగాయి. అధికారాన్ని ఆలంబనగా చేసుకొని నడమంత్రపు సిరిగాళ్లు వేల కోట్ల రూపాయల ఆస్తులను సంపాదించుకున్న విషయం రాష్ట్రంలో కళ్ల ముందే కనిపిస్తున్నది. ఈ పరిణామాల కారణంగానే సమాజంలో అసమానతల తారతమ్యం ఎన్నడూ లేని విధంగా పెరిగింది. దేశాన్ని విదేశీ, స్వదేశీ కార్పొరేట్‌ కంపెనీలకు దోచిపెట్టే విధానాల పర్యవసానమే ఇది. అక్రమ మార్గాలతో పాటు విదేశీ కంపెనీలు లాభాల రూపంలో పెద్ద మొత్తంలో తరలించిన కారణంగానే ఆర్థిక వ్యవస్థ అడుగుజారింది. ప్రధాని చెబుతున్నట్లు విదేశీ పెట్టుబడిదారులు రాకపోవటానికి చమురుపై రాయితీలే కారణమైతే తాజాగా పెంచిన మొత్తంతో సహా చైనాలో లీటరు పెట్రోలు ధర రూ.59 మాత్రమే ఉన్నా ఎందుకు అక్కడికి ఆగిపోలేదు. అసలు అమెరికాలోనే రూ.43 ఉంటే అక్కడి పెట్టుబడిదారులు ఇక్కడ ధరలు పెంచమంటే మనం ఎందుకు పెంచాలి? మన మీద పెత్తనం మనదా అమెరికన్లదా? ఎవరి కోసమీ లొంగుబాటు? ఇది మన స్వాతంత్య్రాన్ని, సార్వభౌమత్వాన్ని Publiture