విద్యార్థిని చితకబాదిన హాస్టల్‌ వార్డెన్‌

ప్రజాశక్తి - రావులపాలెం

స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్‌ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థిని ఆ హాస్టల్‌ వార్డెన్‌ అకారణంగా చితకబాదిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. రావులపాలెంలోని డాన్‌బోస్కో హైస్కూల్లో 7వ తరగతి చదువుతున్న కె.మైఖేల్‌ను వార్డెన్‌ బాలశౌరి కర్రతో విచక్షణారహితంగా కొట్టారు. దీంతో అతను ఏడుస్తూ విలేకరుల కంట పడ్డాడు. దీంతో వారు ఆ విద్యార్థిని ఏమిటని ఆరా తీయగా జరిగిన విషయాన్ని ఏడుస్తూ చెప్పాడు. తాను విజయవాడ నుంచి వచ్చి డాన్‌బోస్కో హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నానని తెలిపాడు. ఈనేపథ్యంలో శనివారం తాను బట్టలు ఉతుక్కుంటున్నానని చెప్పాడు. ఇది చూసిన వార్డెన్‌ బాలశౌరి తన బట్టలను కూడా ఉతకాలని ఆదేశించారన్నాడు. దానికి తాను నిరాకరించడంతో ఆగ్రహావేశాలకు లోనయ్యారని తెలిపారు. 'నేను చెప్పినా చేయవా' అంటూ కర్రతో చితకబాదినట్లు తెలిపాడు. ఈ విషయమై విలేకరులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బాధిత విద్యార్థి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించి, వార్డెన్‌ కొట్టిన దెబ్బలను పోలీసులకు చూపించాడు. దీనిపై విద్యాసంస్థ ఫాదర్‌ సాబును వివరణ కోరగా విచారణ జరిపి చర్యలు చేపడతామన్నారు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్