ప్రజాశక్తి - కాకినాడ ప్రతినిధి
గ్రామీణ నీటిపారుదల శాఖలో పనిచేస్తున్న ఎఇలు ఆయా మండలాల పరి ధిలోని ఎంపిడిఓల పరిధిలో పని చేయాలని ఆదేశాలిచ్చిన కలెక్టర్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కలెక్టర్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే, సమ్మె చేపడతామని ఇంజనీర్ల సంఘం డిమాండ్ చేయనుంది. సోమవారం రహస్యంగా సమావేశమైన ఆర్‌డబ్ల్యుఎస్ ఇంజనీర్ల సంఘంలో పలు తీర్మానాలు చేశారు. ఇటీవల జరిగిన ఎంపిడిఓల సమావేశంలో కలెక్టర్ ఆర్‌డబ్ల్యుఎస్ పనులపై సమీక్షించారు. పనులపై తీరుపై ప్రశ్నించగా తమకు తెలీదని పలువురు ఎంపిడిఓలు సమాధానమిచ్చారు. దీంతో కలెక్టర్ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసు కున్నారు. ఆర్‌డబ్ల్యుఎస్ ఇస్‌ఇ ఎంపిడిఓలకు ఈ సమాచారాన్ని ఎందుకు పంపలేదని ప్రశ్నిం చారు. ఇలా అయితే సమన్వయ సమస్య వస్తు ందని చెప్పారు. ఇక నుంచి ఇలాంటి సమస్య తలెత్తకుండా ఆర్‌బ్ల్యుఎస్ ఎఇలు ఎంపిడిఓల పరిధిలో జవాబుదారీతనంగా పని చేయాలని, ఎంపిడిఓలు ఎఇలకు డ్యూటీ సర్టిఫికెట్‌లు ఇవ్వాలని ఆదేశించారు. ఎంపిడిఓ కార్యాల యాల్లో సంతకాలు పెట్టాలని ఆదేశించారు. దీనిపై శనివారం ఉత్తర్వులు విడుదల చేసినట్లు తెలిసింది. ఆర్‌డబ్ల్యుఎస్ ఇంజనీర్ల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రహస్య సమావేశం పెట్టుకుని కలెక్టర్ నిర్ణయాన్ని ఎట్టిపరి స్థితుల్లోనూ అంగీకరించేదని నిర్ణయించారు. కలెక్టర్ నిర్ణయానికి వ్యతిరేకంగా పని చేయాలని తీర్మానించినట్లు తెలిసింది. ఈ సమస్యలపై రాష్ట్ర సంఘంతో సంప్రదించిన ఇంజనీర్లు మంగళవారం సాయంత్రం కలెక్టర్‌కు సమ్మె నోటీసు ఇవ్వాలని తీర్మానించారు. కలెక్టర్ తప్పుడు నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర కమిటీ కూడా చెప్పినట్లు తెలిసింది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే విధులకు హాజరుకాకుండా మూకుమ్మడి సెలవుల్లోకి వెళ్లాలని తీర్మానిం చినట్లు సమాచారం.