భవిష్యత్తుకు బాటవేసే...పిజి

  • దరఖాస్తుకు చివరితేదీలు...
  • ఉస్మానియా యూనివర్సిటీ-మే 4
  • యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌-మే 4 శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ-ఏప్రిల్‌ 25

డిగ్రీ పూర్తిచేసిన ప్రతి విద్యార్థి చూపు పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ వైపే వెళుతుంది. ఏదో ఒక సబ్జెక్టులో మాస్టరీ లేకపోతే పోటీ ప్రపంచంలో నెగ్గుకు రాలేమన్న సంగతి తెలిసిందే. పరిశోధనవైపు వెళ్లాలనుకునే విద్యార్థి ఎంచుకోవాల్సిన మార్గం కూడా పీజీతోనే మొదలువుతుంది. కాబట్టి ఏదో ఒక యూనివర్సిటీలో ఉన్నత విద్యకు బాటలు వేసుకోవాలి. చక్కని వాతావరణంలో, ఉత్తమమైన అధ్యాపకులు సారథ్యంలో అధ్యయనం కొనసాగించడానికి విద్యార్థి స్వయంగా ప్రయత్నాలు మొదలుపెట్టాలి. రాష్ట్ర స్థాయిలో పలు యూనివర్సిటీలు పీజీ, పరిశోధనకు సంబంధించిన ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి...

దాదాపు ఈ మూడు నెలల కాలంలో పలు యూనివర్సిటీల ప్రవేశ పరీక్షలు జరుగుతున్నాయి. ఉస్మానియా, ఆంధ్ర, శ్రీవెంకటేశ్వర, నాగార్జున, కృష్ణా, నన్నయ యూనివర్సిటీలలో దరఖాస్తు ప్రక్రియలు ప్రారంభమయ్యాయి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా ఈ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. బేసిక్‌ సైన్స్‌, మోడర్న్‌ బయాలజీ, లాంగ్వేజెస్‌ కోర్సుల్లో పోటీ కనిపిస్తోంది. కెమిస్ట్రీ, మేథ్స్‌, ఫిజిక్స్‌, బయో కెమిస్ట్రీ, ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, బయో టెక్నాలజీ, మైక్రోబయాలజీ, నానో టెక్నాలజీ, మెటీరియల్‌ సైన్స్‌...తదితర సబ్జెక్టుల పట్ల విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతోంది.

ఉస్మానియా యూనివర్సిటీ సెట్‌-2012

పలు పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఓయూ పీజీసెట్‌-2012 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంకు సాధించడం ద్వారా, ఉస్మానియా, పాలమూరు, తెలుంగాణ, మహాత్మగాంధీ వర్సిటీలలో వివిధ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. ఒకే దరఖాస్తుపై నాలుగు సబ్జెక్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు.

ఓయూ అందిస్తున్న కోర్సులు : యానిసెంట్‌ ఇండియన్‌ హిస్టరీ..కల్చర్‌-ఆర్కియాలజీ, అరబిక్‌, ఇంగ్లీష్‌, హిందీ, ఇస్లామిక్‌ స్టడీస్‌, కన్నడం, లింగ్విస్టిక్స్‌, మరాఠీ, పర్షియన్‌, ఫిలాసఫీ, సంస్కృతం, తమిళం, తెలుగు, ఉర్దూ, ఎకనామిక్స్‌, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్‌, సైకాలజీ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, సోషియాలజీ, థియేటర్‌ ఆర్ట్స్‌.

ఎమ్మెస్సీ కోర్సులు : ఆస్ట్రానమీ/ఆస్ట్రోఫిజిక్స్‌, బోటనీ, బయోకెమిస్ట్రీ, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్‌, జాగ్రఫీ, జియో ఇన్ఫర్మేటిక్స్‌, జియాలజీ, జెనెటిక్స్‌, మ్యాథమెటిక్స్‌, మైక్రో బయాలజీ, ఫిజిక్స్‌, స్టాటిటిక్స్‌, జువాలజీ, జియోఫిజిక్స్‌, అప్లయిడ్‌ జియో కెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, బయో టెక్నాలజీ, న్యూట్రిషన్‌-డైటిటిక్స్‌, ఫోరెన్సిక్‌ సైన్స్‌.

తెలంగాణా యూనివర్సిటీ కోర్సులు : ఎంఎ కోర్సులు-ఇంగ్లీష్‌, హిందీ, తెలుగు స్టడీస్‌, ఉర్దూ, మాస్‌ కమ్యూనికేషన్స్‌. ఎమ్మెస్సీ కోర్సులు-బయో టెక్నాలజీ, బోటనీ, ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, జియో ఇన్ఫర్మాటిక్స్‌, ఫిజిక్స్‌ విత్‌ ఎలక్ట్రానిక్స్‌, అప్లయిడ్‌ స్టాటిస్టిక్స్‌.

మహాత్మాగాంధీ యూనివర్సిటీ కోర్సులు : ఎంఎ-ఇంగ్లీష్‌, అప్లయిడ్‌ ఎకనామిక్స్‌. ఎమ్మెస్సీ-బయో టెక్నాలజీ, బయో కెమిస్ట్రీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌, జియాలజీ.

పాలమూరు యూనివర్సిటీ : ఎంఎ-ఇంగ్లీష్‌, పొలిటికల్‌ సైన్స్‌, ఎమ్మెస్సీ-కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌, మైక్రో బయాలజీ.

ప్రవేశ పరీక్ష : గంటన్నర వ్యవధిలో జరిగే ప్రవేశ పరీక్షలో మల్టిఫుల్‌ చాయిస్‌ విధానంలో వంద ప్రశ్నలుంటాయి. వర్గీకరణం, సంబంధాలు/ సాదృశ్యాలు, జతపరచటం, రీసెర్చ్‌ స్టడీ/ ఎక్స్‌పరిమెంట్‌ / థియోరిటికల్‌ పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో విద్యార్థి గ్రహణ శక్తిని పరీక్షించేలా ప్రశ్నలడుగుతారు. ఎంసిజె (ఏడాది) కోర్సుకు మాత్రం ప్రశ్నపత్రం రెండు పార్ట్‌లుగా వుంటుంది.

దరఖాస్తు విధానం : వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తు, బ్రోచర్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ : మే 4, 2012

ప్రవేశ పరీక్షల తేదీలు : జూన్‌ 4, 2012 నుంచి...

వెబ్‌సైట్‌ : www.osmania.ac.in

యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌

సెంట్రల్‌ యూనివర్సిటీల్లో ఒకటి యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌. వివిధ పీజీ, పీజీ డిప్లొమా, ఎంఫీల్‌, పిహెచ్‌డి కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దేశంలో అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా పేరు పొందింది. ఈ యూనివర్సిటీ ఆఫర్‌ చేస్తున్న కోర్సులు...

ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ-మ్యాథమెటికల్‌ సైన్సెస్‌, ఫిజిక్స్‌, కెమికల్‌ సైన్సెస్‌, సిస్టమ్స్‌ బయాలజీ, ఆప్టోమెట్రీ-విజన్‌ సైన్సెస్‌, హెల్త్‌ సైకాలజీ.

ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎంఎ-హ్యుమానిటీస్‌...హిందీ/ తెలుగు / ఉర్దూ/ లాంగ్వేజ్‌ సైన్స్‌, సోషల్‌ సైన్సెస్‌...ఎకనామిక్స్‌, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్‌, సోషియాలజీ, ఆంత్రోపాలజీ.

రెండేళ్ల ఎమ్మెస్సీ-మ్యాథమెటిక్స్‌, అప్లయిడ్‌ మ్యాథమెటిక్స్‌, స్టాటిస్టిక్స్‌-ఓఆర్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయో కెమిస్ట్రీ, ప్లాంట్‌ బయాలజీ-బయో టెక్నాలజీ, మాలిక్యూలర్‌ మైక్రో బయాలజీ, యానిమల్‌ బయోటెక్నాలజీ, బయో టెక్నాలజీ, ఓషన్‌-అట్మాస్ఫియరిక్‌ సైన్సెస్‌, హెల్త్‌ సైకాలజీ.

రెండేళ్ల ఎంఎ-ఇంగ్లీష్‌, ఫిలాసఫీ, హిందీ, తెలుగు, ఉర్దూ, అప్లయిడ్‌ లింగ్విస్టిక్స్‌, కంపేరిటివ్‌ లిటరేచర్‌, ఎకనామిక్స్‌, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్‌, సోషియాలజీ, ఆంత్రోపాలజీ, కమ్యూనికేషన్‌, మీడియా స్టడీస్‌, ప్రింట్‌ జర్నలిజం, న్యూ మీడియా, టెలివిజన్‌-రేడియో. వీటితోపాటు ఎంటెక్‌, పిహెచ్‌డి, ఎంఫిల్‌, పీజీ డిప్లొమా కోర్సులను కూడా ఆఫర్‌ చేస్తున్నారు.

దరఖాస్తు విధానం : యూనివర్సిటీ వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తు, ప్రాస్పెక్టస్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఎంపిక విధానం : ప్రవేశ పరీక్ష ద్వారా, ఎమ్మెస్సీ బయో టెక్నాలజీ కోర్సులో ప్రవేశానికి జెఎన్‌యూ-ఆల్‌ ఇండియా కంబైన్డ్‌ బయో టెక్నాలజీ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌లో మంచి ర్యాంకు సాధించి ఉండాలి.

దరఖాస్తుకు చివరితేదీ : మే 4, 2012

ప్రవేశ పరీక్షలు : జూన్‌ 1-జూన్‌ 7

వెబ్‌సైట్‌ :www.uohyd.ac.in

శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ పీజీసెట్‌-2012

వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎస్వీయూఆర్‌పిజీసెట్‌ నోటిఫికేషన్‌ వెలువడింది. ఇందులో మంచి ర్యాంకు సాధించడం ద్వారా శ్రీ వెంకటేవ్వర యూనివర్సిటీ-తిరుపతి, విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం- నెల్లూరు, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం-తిరుపతి, రాయలసీమ యూనివర్సిటీ- కర్నూలు, యోగి వేమన యూనివర్సిటీ-కడప, శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ- అనంతపురం, ద్రవిడ యూనివర్సిటీ- కుప్పంలలో వివిధ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు.

ఎస్వీ యూనివర్సిటీ : ఎంఎ కోర్సులు-అడల్ట్‌ ఎడ్యుకేషన్‌, యానిసెంట్‌ ఇండియన్‌ హిస్టరీ, కల్చర్‌-ఆర్కియాలజీ, ఎకనామిక్స్‌, ఎకనామెట్రిక్స్‌, ఇంగ్లీష్‌, హిందీ, హిస్టరీ, హ్యూమన్‌ రైట్స్‌-డ్యూటీస్‌, లింగ్విస్టిక్స్‌-ఫారిన్‌ లాంగ్వేజెస్‌, పెర్‌ఫార్మింగ్‌ ఆర్ట్స్‌, ఫిలాసఫీ, పొలిటికల్‌ సైన్స్‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, పాపులేషన్‌ స్టడీస్‌, సంస్కృతం, సోషియాలజీ, తెలుగు, తమిళం, ఉర్దూ, ఉమెన్స్‌ స్టడీస్‌-మేనేజ్‌మెంట్‌, ఎంఎస్‌డబ్ల్యు, బిజినెస్‌ ఎకనామిక్స్‌.

ఎమ్మెస్సీ-ఆంత్రోపాలజీ, ఆక్వాకల్చర్‌, బయో కెమిస్ట్రీ, బయో టెక్నాలజీ, యానిమల్‌ బయో టెక్నాలజీ, బయోఇన్ఫర్మాటిక్స్‌, బోటనీ, కెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌, ఎలక్ట్రానిక్స్‌, ఫుడ్‌ టెక్నాలజీ, జియోగ్రఫీ, జియాలజీ, హోంసైన్స్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, ఇమ్యునో టెక్నాలజీ, మ్యాథమెటిక్స్‌, అప్లయిడ్‌ మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌, స్టాటిస్టిక్స్‌, అప్లయిడ్‌ స్టాటిస్టిక్స్‌, స్టాటిస్టిక్స్‌ విత్‌ కంప్యూటర్‌ అప్లికేషన్‌, సైకాలజీ, కౌన్సిలింగ్‌ సైకాలజీ, మైక్రో బయాలజీ, ఇండిస్టియల్‌ మైక్రో బయాలజీ, వైరాలజీ, జువాలజీ, ఎమ్మెస్సీ (టెక్‌) హైడ్రోజియాలజీ.

శ్రీ కృష్ణ దేవరాయ వర్సిటీ : ఎంఎ-అడల్ట్‌ కంటిన్యూయింగ్‌ ఎడ్యుకేషన్‌, అప్లయిడ్‌ ఎకనామిక్స్‌, ఎకనామిక్స్‌, ఇంగ్లీష్‌, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, రూరల్‌ డెవలప్‌మెంట్‌, సోషియాలజీ, తెలుగు.

ఎమ్మెస్సీ-బయో కెమిస్ట్రీ, బయో టెక్నాలజీ, బోటనీ, కెమిస్ట్రీ, ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, కంప్యూటర్స్‌, ఎలక్ట్రానిక్స్‌-కమ్యూనికేషన్స్‌, ఎలక్ట్రానిక్స్‌-ఇనుస్ట్రుమెంటేషన్‌, జాగ్రఫీ, మ్యాథమెటిక్స్‌, అప్లయిడ్‌ మ్యాథమెటిక్స్‌, మైక్రో బయాలజీ, ఫిజిక్స్‌, పాలిమర్‌ సైన్స్‌-టెక్నాలజీ, సెరికల్చర్‌, స్టాటిస్టిక్స్‌, జువాలజీ.

శ్రీ పద్మావతి మహిళ వర్సిటీ : ఎంఎ-అప్లయిడ్‌ ఎకనామిక్స్‌, ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌-లిటరేచర్‌, హిందీ, మ్యూజిక్‌ (వీణ అండ ఓకల్‌), తెలుగు లాంగ్వేజ్‌, లిటరేచర్‌-ట్రాన్స్‌లేషన్‌, ఉమెన్స్‌ స్టడీస్‌, భరత నాణ్యం.

ఎమ్మెస్సీ-అప్లయిడ్‌ మ్యాథమెటిక్స్‌, అప్లయిడ్‌ మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ, బయో ఇన్ఫర్మాటిక్స్‌, బయో టెక్నాలజీ, బోటనీ, ఫుడ్‌-న్యూట్రిషన్‌ సైన్సెస్‌, న్యూట్రిషన్‌-డైటిటిక్స్‌, కమ్యూనిటీ హెల్త్‌-న్యూట్రిషన్‌, హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌-ఫ్యామిలీ స్టడీస్‌, ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, ఫిజిక్స్‌, సైకాలజీ, సెరి బయో టెక్నాలజీ, జువాలజీ.

రాయలసీమ వర్సిటీ : ఎంఎ-ఎంఎ ఎకనామిక్స్‌, తెలుగు, ఇంగ్లీష్‌. ఎమ్మెస్సీ-ఆపరేషన్స్‌ రీసెర్చ్‌-స్టాటిస్టికల్‌ క్వాలిటీ కంట్రోల్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, కంప్యూటర్‌ సైన్స్‌, మ్యాథమెటిక్స్‌, కెమిస్ట్రీ (ఆర్గానిక్‌), బోటనీ, జువాలజీ, బయో టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్‌-కమ్యూనికేషన్‌, బయో కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ.

విక్రమ సింహపురి వర్సిటీ : ఎంఎ-ఇంగ్లీష్‌, తెలుగు, ఎకనామిక్స్‌.ఎమ్మెస్సీ : బయో టెక్నాలజీ, మెరైన్‌ బయాలజీ, మైక్రోబయాలజీ, మ్యాథమెటిక్స్‌, ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, ఫిజిక్స్‌, జువాలజీ, కంప్యూటర్‌ సైన్స్‌, ఫుడ్‌ టెక్నాలజీ.

యోగివేమన వర్సిటీ : ఎంఎ-ఎకనామిక్స్‌, ఇంగ్లీష్‌, హిస్టరీ-ఆర్కియాలజీ, పొలిటికల్‌ సైన్స్‌-పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, తెలుగు, జర్నలిజం-కమ్యూనికేషన్స్‌, హిందీ, ఉర్దూ.

ఎమ్మెస్సీ-ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, యానిమల్‌ సైన్స్‌, అప్లయిడ్‌ మ్యాథమెటిక్స్‌, బయో కెమిస్ట్రీ, బయో టెక్నాలజీ, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌, జెనెటిక్స్‌ అండ్‌ జినోమిక్స్‌, జియాలజీ-జియో ఇన్ఫర్మేటిక్స్‌, మెటీరియల్‌ సైన్స్‌-నానో టెక్నాలజీ, మైక్రో బయాలజీ, ఫిజిక్స్‌, ప్లాంట్‌ సైన్స్‌ (బోటనీ), సైకాలజీ

ద్రవిడియన్‌ వర్సిటీ : ఎంఎ-ఫిలాసఫీ, తెలుగు, తమిళం, కన్నడం, ఇంగ్లీష్‌, హిస్టరీ, ఆర్కియాలజీ-కల్చర్‌, ద్రవిడయన్‌-కంప్యూటేషనల్‌ లింగ్విస్టిక్స్‌.

ఎమ్మెస్సీ-బయో టెక్నాలజీ, ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, కంప్యూటర్‌ సైన్స్‌.

దరఖాస్తు విధానం : ఏదైనా జాతీయ బ్యాంకులో కన్వీనర్‌, ఎస్వీయూఆర్‌పిజి సెట్‌-2012 పేరిట అనంతపురంలో చెల్లేలా రూ.450 డిమాండ్‌ డ్రాఫ్ట్‌ తీసి పంపి దరఖాస్తు పొందొచ్చు.

దరఖాస్తులు పంపడానికి చివరితేదీ : ఏప్రిల్‌, 25, 2012

ప్రవేశ పరీక్షలు : మే 21-మే 28

వెబ్‌సైట్‌ :www.svurpgcet.org

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్