భద్రతకు ఢోకా లేదు

  • టి20 నిర్వాహకుల వెల్లడి

ఈ ఏడాది శ్రీలంకలో నిర్వహించే వరల్డ్‌ టి20 టోర్నీకి భద్రతా పరమైన ప్రమాదాలు ఉన్నట్లు వచ్చిన వార్తలను నిర్వాహకులు తోసిపుచ్చారు. భద్రతా పరమైన ప్రమాదం ఉన్నట్లు రెండు వారాల క్రితం పత్రికల్లో కథనాలు రావడంతో టోర్నమెంట్‌ డైరెక్టర్‌ ఉపేఖా నెల్‌ శుక్రవారం ఒక ప్రకటనలో ఈ విషయం చెప్పారు. సెప్టెంబర్‌ 18 నుంచి అక్టోబర్‌ 7 వరకూ జరిగే ఈ టోర్నీకి అవసరమైన సమగ్ర భద్రతా ప్రణాళిక కోసం నిర్వాహకులు చర్చిస్తున్నారని నెల్‌ తెలిపారు. 2011 వరల్డ్‌ కప్‌ సమయంలో మాదిరిగానే ఈ టోర్నీకి కూడా భద్రత కల్పిస్తామని శ్రీలంక ప్రభుత్వం, శ్రీలంక క్రికెట్‌ బోర్డులు తమకు హామీ ఇచ్చాయని నెల్‌ వివరించారు.

అంబాసిడర్‌గా మలింగ

శ్రీలంకలో జరిగే టి20కి అంబా సిడర్‌గా ఆ దేశ ఫాస్ట్‌ బౌలర్‌ మలింగ వ్యవ హరిస్తాడు. ప్రపంచ వ్యాప్తంగా ఈ టోర్నీని ప్రమోట్‌ చేయడానికి మలింగ కృషి చేస్తాడని ఐసిసి ఒక ప్రకటనలో తెలిపింది. ఈ టోర్నీకి ఆతిథ్య మివ్వడానికి శ్రీలంకకు అవకాశ మిచ్చి నందుకు మలింగ కృతజ్ఞతలు తెలిపాడు. క్రికెట్‌ అభిమానులందరూ ఈ టోర్నీ విజయ వంతమవ్వడానికి సహకరించాలని కోరాడు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్