ఐదుసార్లు అజ్లాన్‌షా ఛాంపియన్ భారత్ నేడు అర్జెంటీనాతో చావోరేవో తేల్చుకోనుంది. పాన్ అమెరికా ఛాంపియన్ అర్జెంటీనాతో భారత్ కీలక మ్యాచ్ ఆడనుంది. టోర్నీలో భారత్ 4 మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో 6 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఫైనల్ చేరాలంటే భారత్ చివరి రెండు మ్యాచ్‌ల్లో గెలవాల్సిందే. గురువారం పాక్‌తో భారత్ తలపడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించడం అంతసులువేం కాదు. సోమవారం నాటి మ్యాచ్‌లో గ్రేట్ బ్రిటన్‌కు అర్జెంటీనా షాకిచ్చింది. అర్జెంటీనా 3-2 గోల్స్ తేడాతో బ్రిటన్‌ను మట్టికరిపించింది. అదే రోజు భారత్ 3-2 గోల్స్ తేడాతో ఆతిథ్య మలేషియాపై విజయం సాధించింది. రెండు జట్లకు విజయావకాశాలు చెరి సమానంగా ఉన్నాయి. చివరి రెండు మ్యాచ్‌లో భారీ విజయాలు సాధించి ఫైనల్ బెర్త్ దక్కించుకుంటామని కోచ్ మైకెల్ నాబ్స్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆసియా టాప్ ర్యాంక్ జట్లు మలేషియా, దక్షిణ కొరియా జట్లను భారత్ ఓడించిన సంగతి నాబ్ గుర్తు చేశాడు. దక్షిణాఫ్రికా జట్టు హ్యాట్రిక్ విజయాలతో 9 పాయింట్లతో అగ్రస్థానంలో దూసుకు పోతోంది.
java.lang.NullPointerException