బెంగళూరు ఔట్‌

  • డెక్కన్‌ ఘన విజయం
  • చెన్నరుకి ఫ్లేఆఫ్‌ ఛాన్స్‌

డెక్కన్‌ ఛార్జర్స్‌ బాదిత జాబితాలో తాజాగా బెంగళూరు చేరింది. తా చెడ్డ డెక్కన్‌ ఛార్జర్‌ రెండు జట్ల ఫ్లేఆఫ్‌ బెర్త్‌లను గల్లంతు చేసింది. చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో ఛార్జర్స్‌ చేతిలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు చిత్తయి ఇంటిదారి పట్టింది. 17 పాయింట్లతో బెంగళూరు, చెన్నరు సమంగా నిలిచినా ధోనీ సేన మెరుగైన రన్‌రేట్‌తో ప్లేఆఫ్‌ బెర్త్‌ ఎగరేసుకుపోయింది. స్టార్స్‌ బ్యాట్స్‌మెన్‌ అమ్ములపొదిలా ఉన్నా బెంగళూరు 133 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. సొంత మైదానం ఉప్పల్లో డెక్కన్‌ వరుస రెండు విజయాలతో టోర్నీ ముగించింది. రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఆదివారం నాటి మ్యాచ్‌లో ఛార్జర్స్‌ 9 పరుగుల తేడాతో బెంగళూరుపై ఉత్కంఠ విజయం సాధించింది. తొలుత డెక్కన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. బదులుగా బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 123 పరుగులు మాత్రమే చేయగలిగింది. డెక్కన్‌ బౌలర్‌ స్టెయిన్‌కి మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ దక్కింది.

133 పరుగుల లక్ష్య ఛేదనలో బెంగళూరుకు గేల్‌ మెరుపు ఆరంభానిచ్చాడు. గోని వేసిన ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లో క్రిస్‌గేల్‌ 4, 4, 6, 4, 6 బాది వీర విహారం చేశాడు. కానీ గేల్‌ (27)ను స్టెయిన్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. దిల్షాన్‌ (4)కూడా స్టెయిన్‌కి వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు. డెక్కన్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో బెంగళూరుకు పరుగులు రావడం కష్టమైంది. స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా 10వ ఓవర్‌లో డివిల్లీర్స్‌ (4), అగర్వాల్‌ (1)లను ఔట్‌ చేసి జట్టుకు బ్రేక్‌ ఇచ్చాడు. కీలక దశలో కెప్టెన్‌ కోహ్లీ (42, 40 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు)ని అశిష్‌ రెడ్డి ఔట్‌ చేశాడు. చివర్లో మిశ్రా, అశిష్‌ దెబ్బకు డివిల్లీర్స్‌ (4), అగర్వాల్‌ (1), జహీర్‌ (0), వినరు (7), మురళీధరణ్‌ (0) స్వల్ప స్కోర్లకే వెనుతిరిగారు. దాంతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 123 పరుగులు మాత్రమే చేయగలిగింది.

తడబడి నిలబడ్డ డెక్కన్‌ : తొలుత టాస్‌ గెలిచి బెంగళూరు కెప్టెన్‌ కోహ్లీ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. డెక్కన్‌ ఛార్జర్స్‌ బ్యాట్స్‌మెన్‌ మరోసారి ఉప్పల్లో తడబడ్డారు. జహీర్‌ వేసిన ఇన్నింగ్స్‌ రెండో బంతిని ధావన్‌ బౌండరీ బాది జోరుమీద కనిపించాడు. కానీ చివరి బంతికి ధావన్‌ (5) క్లీన్‌ బౌల్డయ్యాడు. స్థానిక ఆటగాడు అక్షిత్‌ రెడ్డి (7) వినరు బౌలింగ్‌లో డివిల్లీర్స్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. కామెరున్‌ వైట్‌ (1)ను పరమేశ్వరణ్‌ అద్భుత బంతితో పెవిలియన్‌ చేర్చాడు. డెక్కన్‌ 5 ఓవర్లలో 21 పరుగులకు 3 వికెట్ల కోల్పోయింది. కెప్టెన్‌ సంగక్కర పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డాడు. 10 ఓవర్లలో డెక్కన స్కోరు 47/3. ఛార్జర్స్‌ స్కోరు వంద పరుగులైన దాటుతుందా అనిపించింది. సంగక్కర్‌ (15)ను స్పిన్నర్‌ మురళీధరణ్‌ బోల్తా కొట్టించాడు. డ్యూమిని క్రీజులో కుదురుకున్నాక బ్యాట్‌ ఝలిపించాడు. జహీర్‌ వేసిన 17వ ఓవర్‌లో 4, 6,తో పాటు మురళీధరణ్‌ బౌలింగ్‌లో మూడు సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలో డెక్కన్‌ 17.1 ఓవర్లలో 100 పరుగుల మార్క్‌కి చేరింది. డ్యూమిని (74) జహీర్‌ బౌలింగ్‌లో 19వ ఓవర్‌లో ఔటయ్యాడు. విజరు వేసిన చివరి ఓవర్‌లో పార్థివ్‌ (16), అశిష్‌ రెడ్డి (4) ఔటయ్యారు.

స్కోరు వివరాలు

డెక్కన్‌ ఛార్జర్స్‌ ఇన్నింగ్స్‌ : శిఖర్‌ ధావన్‌ (బి) జహీర్‌ 5, అక్షత్‌ రెడ్డి (సి) డివిల్లీర్స్‌ (బి) వినరు 7, సంగక్కర (సి) విజరు (బి) మురళీధరణ్‌ 15, కామెరున్‌ వైట్‌ (సి) అగర్వాల్‌ (బి) పరమేశ్వరణ్‌ 1, డ్యూమిని (సి) సబ్‌ (అప్పన్న) (బి) జహీర్‌ 74, పార్థివ్‌ (సి) గేల్‌ (బి) వినరు 16, అశిష్‌ రెడ్డి (బి) వినరు 4, స్టెయిన్‌ నాటౌట్‌ 0, అదనపు పరుగులు 10,

మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి) 132 పరుగులు.

వికెట్ల పతనం : 1-6, 2-19, 3-20, 4-51, 5-122, 6-132, 7-132.

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌ : క్రిస్‌ గేల్‌ (బి) స్టెయిన్‌ 27, దిల్షాన్‌ ఎల్‌బిడబ్ల్యు (బి) స్టెయిన్‌ 4, కోహ్లీ (సి) గోనీ (బి) అశిష్‌ రెడ్డి 42, సౌరవ్‌ తివారి (సి) సంగక్కర (బి) ప్రతాప్‌ సింగ్‌ 30, డివిల్లీర్స్‌ (సి) డ్యూమిని (బి) మిశ్రా 4, అగర్వాల్‌ (బి) మిశ్రా 1, జహీర్‌ (బి) స్టెయిన్‌ 0, వినరు (సి) డ్యూమిని (బి) అశిష్‌ రెడ్డి 7, హర్షల్‌ నాట Publiture