కె.విశ్వనాథ్ దర్శకత్వంలో అల్లరి నరేష్, మంజరి ఫడ్నిస్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం అలెప్పీలో షూటింగ్ జరుగుతోంది. అనంత్ శ్రీరామ్ రాసిన 'మౌనమే చెబుతోంది- ఏ మాట- నీ మాటున దాగుందో..'అంటూ సాగే పల్లవితో ఈ పాట చిత్రీకరణ జరుగుతోందని నిర్మాత హరిగోపాలకృష్ణ తెలియజేశారు. ఈనెల 18వరకు షూటింగ్ కొనసాగుతుందన్నారు. 'శుభోదయం' వంటి చక్కటి ఎంటర్‌టైన్‌మెంట్‌లో విశ్వనాథ్ మార్కులా ఈ చిత్రముంటుందని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: యం.వి. హరనాధరావు, సంగీతం: మణిశర్మ, కెమెరా: వేణుగోపాల్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె.విశ్వనాథ్.