ఆగస్టు 10న అందాల రాక్షసి

నూతన నటీనటులు నవీన్‌చంద్ర, రాహుల్‌, లావణ్యలు ప్రముఖ పాత్రల్లో హను రాఘవపుడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'అందాల రాక్షసి'. వారాహి చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి మరియు ప్రముఖ దర్శకుడు రాజమౌళి చిత్రాన్ని నిర్మించారు. రాదన్‌ సంగీతాన్ని అందించారు. ఈ చిత్ర విడుదల విశేషాలను గురువారం రోజు ఏర్పాటు చేసిన సమావేశంలో చిత్ర నిర్మాతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దిల్‌రాజు, రాజమౌళి, సాయికొర్రపాటి, దర్శకుడు హను పాల్గొన్నారు.

దిల్‌రాజు మాట్లాడుతూ...'ఒక నెల క్రితం ఈ సినిమా పాటలు, ప్రోమోస్‌ విడుదలయ్యాయి. ప్రోమోస్‌ చూసి చాలామంది ప్రేక్షకుల్లో క్యురియాసిటీ పెరిగింది. ఆ ప్రేక్షకుల్లో నేను ఒకడిని. ఒక రోజు సాయి నా దగ్గరకొచ్చి సినిమా తీస్కోమని అడగకుండా చూడమన్నాడు. చూశాను. చాలా సెన్సెబుల్‌ సబ్జెక్ట్‌. నాకు బాగా నచ్చింది. అందరూ కొత్త వారితో తీసినప్పటికీ అలాంటి ఫీల్‌ ఎక్కడా కలగలేదు. దర్శకుడు మంచి ప్రతిభావంతుడని నాకు అర్థమైంది. ఈ సినిమా మొత్తం ఎస్‌.వి.సి ద్వారా నేనే విడుదల చేస్తున్నా. ఆగస్ట్‌ 10వ తేదీన 'అందాల రాక్షసి' విడుదల. ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నా'నని అన్నారు.

రాజమౌళి మాట్లాడుతూ...'హనుమంతు ఈ కథను చాలా ప్రేమించి ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకి మొదటి నుంచి నేను భాగస్వామిని కాదు. ఈ సినిమాకి భాగస్వామిని కావడానికి మూడు కారణాలు. ఒకటి ఎయిడ్స్‌ మీద హను తీసిన ఒక షార్ట్‌ ఫిలిం కారణం. అందులోని ఎమోషన్స్‌ నన్ను ముగ్ధుడ్ని చేశాయి. సినిమాని బాగా తీసుంటాడని గట్టి నమ్మకం కలిగింది. మరో కారణం సాయిగారు. మూడో కారణం..పెట్టిన డబ్బు మనకు వస్తుందన్న నమ్మకం. నిర్మాతగా నా పేరు తొలిసారి తెరమీద చూసుకోబోతున్నందుకు నాకు చాలా కారణం ఉంది. సినిమా హిట్‌ కొడుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు' అని అన్నారు.

Sorry

java.lang.NullPointerException