యాక్షన్‌, ఎంటర్‌టైనర్‌...

రామ్‌, హన్సిక జంటగా నటించిన సినిమా 'కందిరీగ'. సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకుడిగా పరిచయమయ్యారు. బెల్లంకొండ సురేష్‌ నిర్మించారు. ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. తిరిగి వీరి కాంబినేషన్‌లో మరో చిత్రం ప్రారంభమైంది. కథానాయికను ఎంపిక చేయాల్సి ఉంది. తీయబోయే ఈ చిత్రం కందిరీగకు సీక్వెలా? కాదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందేనని దర్శకుడు తెలియజేస్తున్నారు.

గురువారం రామానాయుడు స్టూడియోలో లాంఛనంగా షూటింగ్‌ ప్రారంభమైంది. రామ్‌పై తొలి సన్నివేశాన్ని చిత్రీకరించారు. దీనికి స్రవంతి రవికిషోర్‌ క్లాప్‌ కొట్టగా, బి.గోపాల్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. వినాయక్‌ గౌరవ దర్శకత్వం వహించారు.

దర్శకుడు మాట్లాడుతూ...'కందిరీగ కంటే డబుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటుంది. స్క్రిప్ట్‌ అంతా చాలా బాగా వచ్చింది. కందిరీగ సీక్వెల్‌ అనేది అవునా ? కాదా ? అనేది చూసి చెప్పాలి' అని అన్నారు.

రామ్‌ మాట్లాడుతూ...'కందిరీగ తర్వాత ఇంత త్వరగా అదే కాంబినేషన్‌లో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. కందిరీగ కన్నా కూడా ఈ చిత్రంలో ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎక్కువగా ఉంటుంది' అని అన్నారు. నిర్మాత బెల్లంకొండ సురేష్‌ మాట్లాడుతూ...'మే నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమవుతుంది. కందిరీగ కంటే స్క్రిప్ట్‌ బాగా వచ్చింది. యాక్షన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, సెంటిమెంట్‌కు మంచి స్కోప్‌ ఉన్న సినిమాగా పేరు వస్తుంది. హీరోయిన్‌ పేరు త్వరలో వెల్లడిస్తాం' అని అన్నారు. సాయిగణేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బ్యానర్‌పై, మల్టీ డైమన్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సమర్పణలో రూపొందనున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్‌, కెమెరా: వెట్రి, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: సంతోష్‌ శ్రీనివాస్‌.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్